Breaking News

గూడూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఈవిఎం ఇంటర్మీడియేటరీ స్ట్రాంగ్ రూం ను, పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్షీ శ

-డిజిటల్ క్లాస్ రూం విద్యాబోధన, భవిత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ

గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో గూడూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఈవిఎం ఇంటర్మీడియేటరీ స్ట్రాంగ్ రూం ను, జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను, పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మి శ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ గారు గూడూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ఈవిఎం ఇంటర్మీడియేటరీ స్ట్రాంగ్ రూం ను, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను, 35, 36, 49 పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా స్ట్రాంగ్ రూం ను, పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వాకిళ్ళు, కిటికీలు తదితర భద్రత అంశాలపై పలు సూచనలు చేశారు. అలాగే బిఎల్వోలు ఎస్ ఎస్ ఆర్ – 2024 తుది జాబితా మేరకు ఉన్న ఓటర్ల జాబితాలోని ఓటర్ల వివరాలలో మరణించిన వారి వివరాలు, డూప్లికేట్ ఎంట్రీలు అప్డేట్ చేయాలని, ఫోటోలు స్పష్టంగా లేని వాటిని సేకరించి అప్డేట్ చేయాలని సూచించారు

అలాగే 8, 9 తరగతి విద్యార్థులకు డిజిటల్ స్క్రీన్ ప్యానల్ బోర్డుపై విద్యా బోధనను ఆకస్మిక తనిఖీ చేసి వెనుక బెంచీలో కూర్చుని విద్యార్థులతో మమేకమై వారికి డిజిటల్ విద్యా బోధన బాగుందా అని ఆరా తీయగా వారు చాలా చక్కగా విద్యా బోధన ఉందని తెలుపగా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. వెనుక బెంచిలో ఉన్న పిల్లలకు కూడా చక్కగా కనపడేలా స్క్రీన్ పై జూమ్ చేసి బోధన ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం భవిత పాఠశాలను సందర్శించారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కరుణాకర్, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, పాఠశాల హెచ్ ఎం భారతి, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *