-ఎమ్మెల్యే కొడాలి నాని….సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన కమిటీల సభ్యులు
-దేవాలయాల వైభవాన్ని మరింత పెంపొందించేలా కమిటీలు పని చేయాలి…
-దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది…
నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నందివాడ మండలం తమిరిశ గ్రామంలోని దేవదాయ శాఖ ధర్మ చెరువు సత్రం, మరియు శ్రీ వేణుగోపాల సమేత ఆంజనేయ స్వామి వారి దేవస్థాన నూతన కమిటీలు నియామకమయ్యాయి. దేవస్థాన ప్రాంగణంలో నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. తొలుత ఎమ్మెల్యే నానికి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య దేవస్థాన సాంప్రదాయం ప్రకారం అధికారులు గౌరవ స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే నానికు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందచేసి స్వామి వారి ప్రసాదాన్ని ఇచ్చారు.ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే కొడాలి నాని శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని,దేవాలయాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించిన ప్రభుత్వంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు.తెలుగుదేశం హయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూల్చి వేసిన దేవాలయాలను కూడా వైయస్ జగన్ ప్రభుత్వం పునర్నిర్మాణం పూర్తి చేసిందని ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు.ఏమాత్రం ఆదాయం లేని ఆలయాలు శిథిలావస్థకు చేరిన ,జీర్ణోద్ధారణకు దేవాదాయ శాఖ సిజిఎఫ్ (కామన్ గుడ్ ఫండ్) ద్వారా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నామన్నారు. మునుపెన్నడూ లేని విధంగా గుడివాడ నియోజకవర్గంలో అనేక దేవాలయాలు ప్రభుత్వ భక్తుల భాగస్వామ్యం, కమిటీల కృషితో ఎంతో అభివృద్ధి చెందాయని కొడాలి నాని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ధర్మ చెరువు సత్రం కమిటీ సభ్యులు సన్నాల ఉమాశంకర్ రావు,మారక శ్రీనివాసరావు,అలుగొలు వెంకటేశ్వర రావు,గంప సత్యవతి, సింగవరపు ఉమా, నగుళ్ళ కృష్ణా కుమారిలను, శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థాన కమిటీ సభ్యులు జాజుల శివ వెంకటేశ్వర రావు ,మేకతోటి వేంకటేశ్వర రావు,చిర్లాపు దుర్గారావు,జువ్వనబోయిన నాగలక్ష్మి, బట్రాజు అంజలి,కొమ్మూరి సావిత్రి, నగుళ్ళ శివ నాగేంద్రంలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తమిరిశ గ్రామ పెద్దలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ , ఎంపీపీ పెయ్యల ఆదాం, గుడివాడ పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కొండపల్లి కుమార్ రెడ్డి ,ఎంపీటీసీ పిళ్ళా మాణిక్యం, సర్పంచ్ తప్పిట ధనలక్ష్మి , తమిరిశ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు తప్పిట సలోమాన్,వైఎస్ఆర్సిపి నాయకులుకందుల నాగరాజు, కరేటి శ్రీకృష్ణ, మసిముక్కు నాగరాజు,
గంట సురేష్,గుదే రవి,మద్దాల బాబుజి, తోట నాగరాజు, వైఎస్ఆర్సిపి డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షుడు మలిరెడ్డి రవి, దేవదయ శాఖ అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News