Breaking News

మార్చి 6న విజయవాడలో రాష్ట్రస్థాయి ఈఎండీపీ ప్రాజెక్టుల పోటీలు

-పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి విద్యార్థులను తమ స్వయంశక్తితో ఎదగడానికి, మరింత మందికి ఉపాధి ఇచ్చే యువతగా తీర్చిదిద్దే దిశగా గత మూడేళ్లుగా ఎంట్రప్రెన్యూరియల్ మైండ్‌సెట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (EMDP) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు.
ఈ దిశగా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో లాభాపేక్షలేని సంస్థలు ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్ , అఫ్లటూన్ ఇంటర్నేషనల్, రీప్ బెనిఫిట్ సంయుక్తంగా మరియు అమెజాన్ సహకారంతో పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి మొదలై మార్చి 3వ తేదీ వరకు జిల్లా స్థాయి పోటీలు జరుగుతాయన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన 52 ప్రాజెక్టులకు మార్చి 6న విజయవాడలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారానికి 8 జిల్లాల నుంచి 2429 ప్రాజెక్టులు రాగా, అందులో 93 ప్రాజెక్టులు జిల్లా స్థాయిలో ప్రదర్శించారని తెలిపారు. ఈ పోటీలు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా సైన్స్ అధికారులు సహకారంతో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
29 నాటికి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన 16 ప్రాజెక్టులు
1. విశాఖపట్నంనుండి జ్ఞాననికేతన్ ఎయిడెడ్ స్కూల్ కు ప్రథమ స్థానం, జీహెచ్ఎస్ రైల్వే కాలనీ స్కూలుకు ద్వితీయ స్థానం.
2. తిరుపతి నుండి జెడ్పీహెచ్ఎస్ తడకు ప్రథమ స్థానం, జెడ్పిహెచ్ఎస్ ఆర్ జి కాలనీ కి ద్వితీయ స్థానం.
3. కర్నూలు నుండి జెడ్పిహెచ్ఎస్ చెరుకులపాడుకు ప్రథమ స్థానం, డా. ఏపీజే ఆబ్దుల్ కలాం మున్సిపల్ హై స్కూలుకు ద్వితీయ స్థానం
4. చిత్తూరు నుండి జడ్పీహెచ్ఎస్ పదిరికుప్పంకు ప్రథమ స్థానం, జెడ్పీహెచ్ఎస్ జి.డి. నెల్లూరు కు ద్వితీయ స్థానం.
5. నంద్యాల నుండి జెడ్పీహెచ్ఎస్ నందీవర్గం కు ప్రథమ స్థానం, కేజీబీవీ సిర్వెల్ కు ద్వితీయ స్థానం.
6. కృష్ణా నుండి ఎస్.ఎమ్.కె జడ్పీహెచ్ఎస్ మొవ్వ కు ప్రథమ స్థానం, ఎస్. ఎల్. ఎస్. వి. వి. ఎస్ ఓ. హెచ్. ఎస్ పెదముత్తేవి కు ద్వితీయ స్థానం
7. పల్నాడు నుండి డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులంకు ప్రథమ స్థానం, జడ్పీహెచ్ఎస్ తూబాడు కు ద్వితీయ స్థానం
8. శ్రీ సత్య సాయి నుండి జడ్పీహెచ్ఎస్ ధనపురంకు ప్రథమ స్థానం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల తలుపుల కు ద్వితీయ స్థానం పొందారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *