Breaking News

మహిళా సాధికారతే లక్ష్యం – నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గురువారం ఉదయం పశ్చిమ నియోజకవర్గ పరిధి లో గల 120 సచివాలయం హరిజవాడ విఎంసి కమ్యూనిటీ హాల్, భవానిపురం నందు విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో గల 40 మరియు 41వ డివిజన్ల మహిళలకు బ్యాచ్ కు 30 మంది చొప్పున రెండు డివిజన్లకు రెండు బ్యాచ్లకు కుట్టు మిషన్లో శిక్షణ ఇవ్వటమే కాకుండా కుట్టడంలో నైపుణ్యతను పెంచుకొని తద్వారా స్వయం శక్తితో ఉపాధి పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని. తద్వారా మహిళా సాధికారత ఖచ్చితంగా సాధిస్తామని అన్నారు. మార్చ్ ఒకటి నుండి మొదలవుతున్న కుట్టు మిషన్ లో శిక్షణ కార్యక్రమం మూడు నెలల వరకు జరుగుతుందని ఆ మూడు నెలల్లో మహిళలు చక్కగా కుట్టడంలో నైపుణ్యతను ఖచ్చితంగా సాధిస్తారని, ఇక్కడున్న ప్రతి ఒక్క మహిళ కుట్టడం ద్వారా ఆర్థికంగా బలపడుతుందని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో మహిళా అభివృద్ధికి ధ్యేయం గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా స్థిరపడాలని ఉద్దేశంతో సంక్షేమ పథకాలైన జగనన్న చేయూత, అమ్మ ఒడి మరియు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలతో మహిళా సాధికారతను సాధిస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో 40వ డివిజన్ కార్పొరేటర్ యరడ్ల ఆంజనేయ రెడ్డి, 41వ డివిజన్ కార్పొరేటర్ మొహమద్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *