Breaking News

యువత ఓటింగ్ లో పాల్గొనాలి

– వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
50 శాతం పైగా ఉన్న యువత రాబోవు ఎన్నికలలో ఓటింగ్ లో పాల్గొనాలని ప్రధాన భూమిక వహించాలని సిటిజన్స్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 29న గురువారం ఓడలరేవులోని బి.వి.సి ఈ ఇంజనీరింగ్ కళాశాలలో ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే అంశంపై జరిగిన కళాజాత కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమౌళి వి ఎస్ఏ అధ్యక్షత వహించారు. వల్లoరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ గత చట్టసభలలో ఒకప్పుడు త్యాగధనులు, మేధావులు, దేశభక్తులు ఉండేవారని నేడు క్రిమినల్స్, ధనార్జనపరులు, కాంట్రాక్టర్లు ఉంటున్నారని ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందన్నారు. భారతదేశంలో అత్యధిక ఎన్నికల వ్యయం జరిగే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతుందని ఇసుక, మట్టి, గనుల మాఫియా, మద్యం మాఫియా, ఫ్యాక్షనిస్టులు ఎన్నికల రంగంలో దిగి పోటీ పడుతున్నారని అన్నారు. పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం పెంచడానికి కళాజాతను అన్ని జిల్లాల జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నత ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత గల మేధావులు మౌనంగా ఉంటే సమాజం నష్టపోతుందని తెలిపారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో అనేక లోపాలు జరుగుతున్నాయని వాటిని సరి చేసే బాధ్యత రాజకీయ పార్టీల స్థానిక నేతలు తీసుకోవాలని అన్నారు. వలంటీర్ల వ్యవస్థను ఎన్నికలకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినా అధికార పార్టీ ఎన్నికలలో వలంటీర్లను ఉపయోగిస్తామని, వారిని పోలింగ్ ఏజెంట్లుగా ,ఎన్నికల సైన్యంగా వాడుకుంటామని పేర్కొనటాన్ని తీవ్రంగా ఖండించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమౌళి ప్రసంగిస్తూ ఓటు హక్కు రామబాణం లాంటిదని ఈ హక్కును విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకొని, మంచి పాలకులను ఎన్నుకోవాలని కోరారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నేత డాక్టర్ ఈ ఆర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ ప్రపంచంలోనీ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఇండియాలో అవినీతి రహిత, అభివృద్ధికి తోడ్పడే సుస్థిర పాలన అందించే ప్రభుత్వాలను ఎన్నుకోవాలని కోరారు. లోక్ సత్తా ఉద్యమ నేత ఉప్పుగంటి భాస్కరరావు ప్రసంగిస్తూ, డబ్బు ,మద్యం లాంటి ప్రలోభాలకు లోనైఅనర్హులను గెలిపిస్తే సమాజం తిరోగమనస్తుందని తెలిపారు. కులము.మతము, ప్రాంతాల దురభిమానులకు లోను కాకుండా సమాజహితులను గెలిపించు కోవాలని కోరారు. కళాశాల డీన్ డాక్టర్ టీవీ జనార్దన్ రావు ప్రసంగిస్తూ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు గడిచాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉత్తమ ప్రభుత్వాలను ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధికి నాంది పలికాలన్నారు. ఈ సందర్భంగా రంగం ప్రజా సాంస్కృతిక వేదిక ఆర్ రాజేష్ నేతృత్వంలో 12 మందితో కూడిన కళాకారుల బృందం ఆట మాట పాటలతో ఓటర్లను జాగృతులను చేసే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి సబికులను ఆలోచింప చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీపాద రామకృష్ణ స్వాగత ఉపన్యాసం చేశారు. వందలాది మంది విద్యార్థులు కళారూపాలను ఆస్వాదించి తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటామని, ఓటు అంబాసిడర్ గా మారి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కృషి చేస్తామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *