విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డా. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ నూరు శాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
నగరంలోని కలెక్టరేట్ నుండి గురువారం యంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లు, జిల్లా కో-ఆర్డినేటర్‌తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, ఈ`కెవైసి (బయో మెట్రిక్) యాప్ డౌన్‌లోడ్ తదితర అంశాలపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్య భద్రతను హక్కుగా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలు, మధ్యతరగతి ప్రజలకు రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు ఉద్దేశించిన డా. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియ జిల్లాలో నూరు శాతం పూర్తి కావాలన్నారు. వాలంటీర్ల ద్వారా ఈ-కేవైసీ ఆధారంగా పారదర్శకంగా, జవాబుదారీతనంతో కార్డుల పంపిణీ జరపాలన్నారు. వివిధ కారణాలతో కార్డులపై కుటుంబ యజమాని ఫోటో ప్రచురణ కాని వాటిపై సంబంధిత యజమాని ఫోటో సేకరించాలన్నారు.ఆరోగ్యశ్రీ కార్డులలో మార్పు, చేర్పులకు అవకాశం ఉందని, అవసరమైతే కొత్తవారిని కూడా జత చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం ప్రచురించిన కరపత్రాలను లబ్దిదారులకు అందించాలన్నారు. పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు వీలుకల్పించే ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరిచే డౌన్‌లోడ్ చేయించాలన్నారు. యాప్‌ను డౌన్‌లోడు చేసుకునేందుకు సిబ్బంది సహకరించాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ నూరు శాతం పూర్తి కావాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
జిల్లా కో-ఆర్డినేటర్ జె. సుమన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 5 లక్షల 82 వేల 423 ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ లక్ష్యం కాగా నేటి వరకు అందిన 4 లక్షల 11వేల 790 కార్డుల పంపిణీని పూర్తి చేయడం జరిగిందని ఇంకనూ పెండిరగ్ లో ఉన్న 32 వేల 160 కార్డులలో 20 వేల వరకు ఇతర ప్రాంతాలకు వలస, డెత్‌కు చెందినవి ఉన్నాయని వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డా.పి. సంపత్ కుమార్, యంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లు ఉన్నారు.
Prajavartha Online Telugu News