
-వైయస్సార్ తెలంగాణ పార్టీ మాజీ నాయకులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత మూడు సంవత్సరాల క్రితం రాజన్న బిడ్డనంటూ తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టక ముందే రాజన్న సంక్షేమ పాలన రాజన్న రాజ్యం అని చెప్పి తెలంగాణలో మురుసుపల్లి షర్మిల మోసం చేసిందని వైయస్సార్ తెలంగాణ పార్టీ మాజీ నాయకులు ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ మాజీ నాయకులు లక్కినేని సుధీర్‌బాబు మాట్లాడుతూ వైయస్సార్ అభిమానులు, నాయకులు ప్రతి ఒక్కరూ నాతో కలిసి రావాలని తెలంగాణ ప్రజలను పిలుపునిచ్చిన షర్మిల వెంట నమ్మి నడిచామని, అనుకున్నట్లుగానే వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం చేసిందని, మొట్టమొదటి సంకల్ప సభ ఖమ్మంలో ఏర్పాటు జరిగిందని ఆ సభకు స్వతహాగా నాయకులు ఖర్చు పెట్టుకుని సభను విజయవంతం చేయడం జరిగిందని అన్నారు. ఆ సభకు వచ్చిన చాలామంది కార్యకర్తలకు, నాయకులకు, కరోనా వ్యాధి సోకిందని వారిని ఎవరిని పరామర్శించడానికి కూడా ఆమె రాలేదని వాపోయారు. ఈ సందర్భంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ మాజీ నాయకులు డేవిడ్ శాంతరాజ్ మాట్లాడుతూ పార్టీని ఆమెను నమ్మి ఎంతో డబ్బు ఖర్చు పెట్టామని, ఆమె మమ్మల్ని నడిరోడ్డుపై విడిచిపెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందన్నారు. ఆమె అనుచరులు తాటి సతీష్, రాంరెడ్డిలు ఏది చెప్తే అదే చేసేదని పార్టీ కార్యకర్తలు నాయకులు వారి సమస్యలు చెప్పిన షర్మిల అర్థం చేసుకునేవారు కాదని ఆయన అన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్న పెద్ద నాయకులు ఎవరు పార్టీలోకి రాలేదన్నారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో పోటీ చేసేవారు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించిన షర్మిల కార్యకర్తల్లో నాయకుల్లో ఆశలు రేగెత్తించిందన్నారు. 119 నియోజవర్గాలకు పోటీ చేసేందుకు దాదాపుగా 550 మంది దరఖాస్తు చేసుకోగా చివరి క్షణంలో పోటీ చేయడం లేదంటూ ఒక్కసారిగా మహానేత ఆశయాలకు తూట్లు పొడుస్తూ నమ్ముకున్న వారి గుండెల్లో గునపాలు దించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా కాంగ్రెస్ వారు దొంగ చేతికి తాళాలు ఇచ్చారని అన్నారు. షర్మిల చేతిలో మేము మోసపోయినట్లుగా మీరు మోసపోకూడదని అదే ఉద్దేశంతో మీకు వాస్తవాలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. మాకు న్యాయం జరిగేంత వరకు పలు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మహానేత ఆశయాల కోసం జగనన్న కాంగ్రెస్ పార్టీ ఢల్లీి హైకమాండ్ ను ఢీకొట్టి ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి రాజన్న రాజ్యం తెచ్చారని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా షర్మిలను నమ్మకండి, ఉన్నది అమ్ముకోకండి అంటూ హితవుపలికారు. ఈ సమావేశంలో మెదిని రామలింగారెడ్డి, తమ్మిలి బాలరాజు, బానోత్ రాజ్‌కుమార్, పాకాల దానియేలు, కాకుంట్ల రాజశేఖర్‌రెడ్డి, ఇందుర్తి వెంకటరెడ్డి. తడక జగదీశ్వర్ గుప్తా, దుర్గం నగేష్ నేత, భక్తుల దేవరాజ్, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News