రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం తూర్పు గోదావరి జిల్లాలోని చాగల్లు మండలంలోని కలవలపల్లి గ్రామములోని YSR గ్రామ హెల్త్ క్లినిక్ ప్రక్కన గల ఖాళీ స్థలము నందు పి.డి.ఎస్ (చౌక బియ్యం) అక్రమ నిల్వకు సంబంధించిన విశ్వసనీయ సమాచారంపై ఈరోజు మా బృందం విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి తనిఖీ చేయగా 46 బస్తాలలో సుమారు 2050 కేజీల PDS బియ్యంను గుర్తించటమైనది. సదరు పి.డి.ఎస్(చౌక బియ్యం)ను మెట్టపల్లి నరసింహరాజు, తండ్రి చంద్రరావు వారు కలవలపల్లి, ఉంకరమల్లి మరియు రామచంద్రాపురం గ్రామములలోని రేషన్ కార్డుదారుల నుండి కిలో రూ.16/-కి కొనుగోలు చేసి ఇటుక బట్టీ మరియు ఇతర కార్మికులకు కిలో రూ.18/-కి విక్రయిస్తున్నాడు. సదరు బియ్యంకు సంబందించి ఎటువంటి బిల్లులు లేనందున సివిల్ సప్లయ్స్ అధికారులు, చాగల్లు వారు సుమారు రూ 92,375 /- లు విలువ గల 2050 కేజీల పి.డి.ఎస్(చౌక బియ్యం)ను సీజ్ చేసి 6-ఏ క్రింద కేసు నమోదు చేసి, PDS బియ్యాన్ని అక్రమముగా కొనుగోలు చేసి, అమ్మకము చేస్తున్న మెట్టపల్లి నరసింహరాజు మరియు సంబందిత వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు కొరకు సిఫారసు చేయటమైనది.
ఈ సందర్భముగా ఎస్.పి. కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి, ఐ.పి.ఎస్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో పి.డి.ఎస్(చౌక బియ్యం) అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా కొనసాగుతుంది అని, ఎవ్వరైనా పి.డి.ఎస్(చౌక బియ్యం) కొనడం, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపియున్నారు. ఈ తనిఖిలలో విజిలెన్స్ అధికారులు జగన్నాధ రెడ్డి, లక్ష్మీనారాయణ, చాగల్లు సి.ఎస్.డి.టి బాపిరాజు పాల్గొన్నారు .
Prajavartha Online Telugu News