Breaking News

శేరికల్వపూడి గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటన…..పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

-రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి….. ప్రజలకు అందిస్తున్న సంక్షేమం ప్రతిపక్షాలకు కనిపించదు
-రాష్ట్రంలోని పేద వర్గాలు నష్టపోయిన…. రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టైనా సరే….. అధికారమే ప్రతిపక్షాల లక్ష్యం
-కులతత్వ.. మతతత్వ… ధనిక పార్టీలు…. పెత్తందారుల కూటమికు ప్రజలు బుద్ధి చెప్పాలి…. సీఎం జగన్ కు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి

గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుడ్లవల్లేరు మండలం శేరికల్వపూడి గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని మంగళవారం పర్యటించారు. గ్రామంలో రూ.43.60 లక్షల నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం,రూ.21.80 లక్షలతో నిర్మించిన వైయస్సార్ రైతు భరోసా కేంద్ర భవనం, కే.డి.సి.సి. బ్యాంక్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డుకు భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.తొలుత గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే కొడాలి నానికు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ భారీ ర్యాలీగా గ్రామంలో పర్యటిస్తు, ఎమ్మెల్యే కొడాలి నాని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వీధి వీధినా ఎమ్మెల్యే నానికు మంగళ హారతులతో మహిళా సోదరీమణులు, పూల మాలలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, స్వర్గీయ వైఎస్ఆర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు ఎమ్మెల్యే కొడాలి నాని నివాళులర్పించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ అధికారంలోకి రానని తెలిసిన చంద్రబాబు, తనపై ఉన్న కేసుల్లో అరెస్టు కాకుండా ఉండేందుకే పొత్తు డ్రామా ఆడుతున్నాడని విమర్శించారు.అధికారం కోసం చంద్రబాబు ఎన్ని మోసాలు అయినా చేస్తాడు….ఎంతమంది బూట్లయినా నాకుతాడని ఎమ్మెల్యే నాని మండిపడ్డారు. నా ఎస్సీలు… నా బీసీలు…నా ఎస్టీలు… నా మైనార్టీలు…. నా అగ్రవర్ణ పేదలు అంటూ సీఎం జగన్ చెప్పినట్లు దమ్ము ధైర్యంగా చెప్పే సీఎం దేశంలో మరొకరు లేరని కొడాలి నాని అన్నారు. కుల మత వర్గ పార్టీలకతీతంగా ప్రజలకు సీఎం జగన్ చేసిన మంచిని చూసి ప్రతి ఒక్కరు తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తు పై నొక్కాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. అధికార దాహంతో ఉన్న ప్రతిపక్షాలు చెప్పే దొంగ మాటలను ప్రజలు విశ్వసించవద్దని ఎమ్మెల్యే నాని విజ్ఞప్తి చేశారు.అనంతరం ఎమ్మెల్యే కొడాలి నానికు గ్రామ పెద్దలు ఆత్మీయ సత్కారం చేశారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ పడమటి సుజాత, గుడ్లవల్లేరు మండల పార్టీ అధ్యక్షుడు మరియు వైస్ ఎంపీపీ సాయన రవి, ఎంపీటీసీ కొడాలి కన్నమ్మ, సర్పంచ్ కొత్తూరి వెంకటలక్ష్మి, సెరీ కల్వపూడి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని రాఘవేంద్రరావు, గుడ్లవల్లేరు మండల బూత్ కమిటీ కన్వీనర్ కోటప్రోలు నాగు, శ్రీ కొండలమ్మ తల్లి గుడి కమిటీ చైర్మన్ శేషం గోపి, గుడ్లవల్లేరు యువజన విభాగ అధ్యక్షుడు గుదే రవి, కృష్ణాజిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షుడు కళ్లేపల్లి పవన్, వడ్లమన్నాడు యమ్ పి టీ సి మండల దిలీప్, వైఎస్ఆర్సిపి నాయకులు పాలేటి చంటి, కొడాలి శివ, గుడ్లవల్లేరు మండల సచివాలయల కన్వీనర్ కొత్తూరి లక్ష్మీనారాయణ, అంగలూరు పిఎసిసి డైరెక్టర్ దుగ్గిరాల శేషు బాబు, లింగవరపు నవీన్, కాటూరి చలపతిరావు, కాటూరి మహేష్, కాటూరి బోస్, లింగవరపు సుబ్రహ్మణ్యం, కుందేటి అంజనేయులు, పోలుకొండ వెంకటేశ్వరరావు, గోగులమూడి వినోద్, గోగులముడి వినయ్, బట్టు రాంబాబు, గోగులమూడి చెన్నారావు, గోగులమూడి శ్రీనివాసరావు, మద్దాల రాంబాబు, మందపాటి ఆరోగ్యం, కొడాలి సుధాకర్, కొనాల లూధర్, కొనాల ప్రసాద్, మంటాడ చలమయ్య, గరికిపాటి సముద్రుడు, అరెపు సత్యనారాయణ, కలపాల థామస్, కొడాలి అర్జునరావు, కొండేటి ఆదాం, కొండేటి అంథోని, దుగ్గి సుబ్బారావు, దుగ్గి జయ, కొడాలి మైనిరు, వెంకటేశ్వరావు, కొండేటి కోటయ్య, నిమ్మగడ్డ కుటుంబరావు, ముత్యాల రాజేష్, బలుసు జితేంద్ర, రేమల్లి ప్రసాద్, పోస్టల్ రాజు, వాలి ప్రవీణ్, నందివాడ యమ్ పి పి పెయ్యాల ఆదాం, మట్టా జాన్ విక్టర్, మహమ్మద్ ఖాసీం ( ఆబు ), కొండపల్లి కుమార్ రెడ్డి, పాలడుగు రాంప్రసాద్, వల్లూరుపల్లి సుధాకర్, కసుకుర్తి జనార్దన రావు ( గుడ్లవల్లేరు బాబ్జి ), గిరి బాబాయ్, గంట సురేష్, డాక్టర్ ఆర్కే, చుండూరు శేఖర్, మామిళ్ళ ఎలీషా,మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు అభిమానులు , సచివాలయ కన్వీనర్ లు , గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *