Breaking News

ఎన్నికల నియమావళి పై ప్రింటర్స్, పబ్లిషర్స్ యజమానుల యొక్క సమావేశము…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల నియమావళిని అనుసరించి విజయవాడ మధ్య నియోజక వర్గము నందలి ప్రింటర్స్, పబ్లిషర్స్ యజమానుల యొక్క సమావేశము నగరపాలక సంస్థ కమీషనర్/రిటర్నింగ్ అధికారి, విజయవాడ సెంట్రల్ నియోజక వర్గము. విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయము నందు జరిగినది. ఈ సమావేశము నందు నగర పాలక సంస్థ కమీషనర్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రింటర్స్/పబ్లిషర్స్, పాంప్లెట్స్, పోస్టర్స్ ముద్రించు విషయములో పాటించవలసిన నిబంధనలు ఎన్నికల నియమావళి MCC 127 (A), మరియు ఆంధ్రప్రదేశ్ డిస్ ఫిగర్ మెంట్ ఆఫ్ ఓపెన్ ప్లేసెస్, ప్రొహిబిషన్ ఆఫ్ అబ్జెక్షనబుల్ పోస్టర్స్ ఆక్ట్ 1997 మరియు ప్రకటనలు ముద్రించుకొను యజమానుల నుండి తీసుకొనవలసిన అండర్ టేకింగ్ లను వివరించడమైనది. నిబంధనలు ఉల్లఘించిన యెడల తీసుకొను చర్యలు తెలియజేయడమైనది. ఇకపై పాంప్లెట్స్, పోస్టర్స్ మొదలగునవి ముద్రించునపుడు ప్రింటర్స్ చిరునామా/ ఫోను నెంబరు, ముద్రించుకొను యజమానులు చిరునామా/ ఫోను నెంబరు ముద్రించని యెడల కఠిన చర్యలు తీసుకొనబడునని తెలియజేయడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *