Breaking News

విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దులు, ట్రాన్స్‌జండర్స్‌కు పోలింగ్‌ కేంద్రాలలో ప్రత్యేక సదుపాయాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దులు, ట్రాన్స్‌జండర్స్‌ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలలో ప్రత్యేక సదుపాయాలు కల్పించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. సాధారణ ఎన్నికలలో ఓటింగ్‌ శాతం పెంపు, పోలింగ్‌ కేంద్రాలలో కల్పించిన సదుపాయాలపై వమోవృద్దులు, విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జండర్స్‌, సంబంధిత శాఖల అధికారులతో గురువారం కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్‌ కేంద్రాలలో అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. ఓటింగ్‌ శాతం 80 నుండి 85 శాతం నమోదు అయ్యేలా స్వీప్‌ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 85 సంవత్సరాలు పై బడిన 9,572 మంది వయస్సు కలిగిన వారు, పర్సన్స్‌ విత్‌ డిజబుల్టీ (పిడబ్ల్యుడి) 14,838 మొత్తంగా 24,410 మంది ఓటర్లు నమోదు అయి ఉన్నారన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పోలింగ్‌ కేంద్రాలలో ప్రత్యేక సదుపాయాలు కల్పించడం జరిగిందని దీనిలో భాగంగా ర్యాంప్‌, వీల్‌చైర్‌,వాలంటరీ సర్వీస్‌, ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేశామన్నారు. 85 సంవత్సరాలు పై బడి, పోలింగ్‌ కేంద్రానికి వెళ్ళి ఓటు వేయలేని స్థితిలో ఉండి ఫార్మం`12డి ద్వారా నమోదు చేసుకున్న వారి అర్హతను బట్టి హోమ్‌ ఓటింగ్‌ సదుపాయం కల్పించేందుకు ఎర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ కేంద్రాలలో కల్పించిన సదుపాయాలపై అధికారులు అవగాహన కల్పించి అన్ని వర్గాల ఓటర్లు ఓటు వేసి పోలింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. సమావేశంలో జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికారి యు.శ్రీనివాసరావు, డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాసరావు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కామ రాజు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి బి. విజయభారతి తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *