– రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్‌రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మీడియా సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని మీడియా సంస్థల ప్రతినిధులకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్‌రెడ్డి సూచించారు. నగరంలోని స్టేట్ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలోని జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్‌రెడ్డి.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, జాయింట్ కలెక్ర్ డా. పి.సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పుదోవ పట్టించేలా సమాచార ప్రవాహం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని.. ఎన్నికలకు సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని మీడియా ద్వారా ప్రజలకు అందించేందుకు ఈ మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు.. ఇలా వివిధ స్థాయిల్లో అధికారులు అందించిన ధ్రువీకరించిన సమాచారాన్ని ఈ మీడియా సెంటర్లో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. గత ఎన్నికల్లో విజేతల వివరాలు, మెజారిటీ తదితర వివరాలను డిస్ప్లే చేయడం జరిగిందన్నారు. ఇంత మంచి వాతావరణంలో మీడియా సెంటర్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ గారు చేసిన కృషి అభినందనీయమని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్‌రెడ్డి అన్నారు.
Prajavartha Online Telugu News