-సిబ్బంది విధులలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
-జిల్లా ఎస్పీ పి.జగదీష్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని కడియం పోలీస్ స్టేషన్ పరిధిలోని పొట్టిలంక వద్దగల జిల్లా బోర్డర్ చెక్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఏ విధముగా వాహనాలను తనిఖీ చేస్తున్నారో తెలుసుకునేందుకు గాను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్వయంగా వాహన తనిఖీల్లో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ… రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గంజాయి, నాటు సారా, అక్రమ మధ్యము, నగదు మరియు ఇతర నిషేధిత అక్రమ రవాణాలను అరికట్టవలసిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉన్నదని, సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, వాహన డ్రైవర్లు యజమానులతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలని ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని, నిఘా కెమెరాలతో చెక్ పోస్టులు నిరంతరం పర్యవేక్షించే విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారు లకు మరియు సిబ్బందికి హితువు పలికినారు. ఈ ఆకస్మిక తనిఖీలలో జిల్లా ఎస్పీ గారితో పాటుగా కడియం ఇన్స్పెక్టర్ బి. తులసీదర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News