తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈఎస్ఎంఎస్ సీజర్ వివరాలు నగదు, లిక్కర్, డ్రగ్స్ తదితర అంశాల వివరాలు వివిధ టీంల, పోలీస్ అధికారుల కన్సాలిడేటెడ్ సీజర్ వివరాలు జిల్లా ఎక్ష్పెండిచర్ నోడల్ అధికారి సమన్వయంతో ఒకే రకమైన నివేదికలు ఉండేలా పని తీరు ఉండాలని ఇంఛార్జి కలెక్టర్ ధ్యానచంద్ర హెచ్ఎం అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ మరియు అకౌంటింగ్ టీమ్ ల సమన్వయ సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేసి ఇంఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఈఎస్ఎంఎస్ సీజర్ వివరాలు నగదు, లిక్కర్, డ్రగ్స్ తదితర అంశాల వివరాలు వివిధ టీంల, పోలీస్ అధికారుల కన్సాలిడేటెడ్ సీజర్ వివరాలు జిల్లా ఎక్ష్పెండిచర్ నోడల్ అధికారికి సమన్వయంతో ఎప్పటికప్పుడు అందేలా, ఒకే రకమైన నివేదికలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోలీస్ అధికారుల నివేదికలు ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి నివేదికలు కన్సాలిడేటెడ్ వివరాలు సంబంధిత నియోజకవర్గం ఏఈఓ నుండి జిల్లా నోడల్ అధికారికి అందేలా పనితీరు ఉండాలని సూచించారు. సీజ్ చేసిన నగదు సంబంధీకులకు వారు సరియైన ధ్రువపత్రాలు కలిగి ఉన్నచో వారి గ్రీవెన్స్ పరిష్కారంతో తిరిగి ఇచ్చే వాటి కొరకు జిల్లా స్థాయిలో త్రీ మెన్ కమిటీ ఏర్పాటు ఉందని ఇందులో జిల్లా ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి,జిల్లా ట్రెజరీ అధికారి సభ్యులుగా పరిశీలన చేసి తగు చర్యలు చేపడతారని తెలిపారు. అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, పోలీసు అధికారులు వివిధ టీంలు సమన్వయంతో ఒకే రకమైన నివేదికలతో ఉండేలా పనితీరు ఉండాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి చరణ్ రుద్రరాజు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చెన్నయ్య, ఈఎస్ఎంఎస్ నోడల్ అధికారిణి గీతారాణి వివిధ నియోజకవర్గ సహాయ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు మరియు అకౌంటింగ్ టీమ్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News