Breaking News

ఎన్నికల మార్గదర్శకాల హ్యాండ్ బుక్ మేరకు సమన్వయంతో విధులు నిర్వర్తించాలి: ధ్యానచంద్ర

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు వారి విధులను అప్రమత్తంగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు తూ.చా తప్పకుండా నిర్వర్తించాలని ఇంఛార్జి కలెక్టర్ ధ్యానచంద్ర హెచ్ఎం పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఇంఛార్జి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు, సంబంధిత నోడల్ అధికారులతో కలిసి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు వారి బాధ్యతలపై, నామినేషన్ల ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించి దిశా నిర్దేశం చేశారు.

తిరుపతి జిల్లాలో ఎన్నికల విధులలో పాల్గొంటున్న అధికారులు ఎంతో బాధ్యతగా సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఎన్నికల విధులు గతంలో నిర్వర్తించిన అనుభవం ఉన్నా కూడా ప్రతిసారి కొత్తగా ఎన్నికలను చూడాలని, రిటర్నింగ్ అధికారి హ్యాండ్ బుక్ ఎన్నికల మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకుని తదనగుణంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని ఎలాంటి అలసత్వం ఉండరాదని ఎన్నికల నిర్వహణ ఒక టీం వర్క్ అని పూర్తి సమన్వయంతో విధులు చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ 18న సార్వత్రిక ఎన్నికలు 2024 నోటిఫికేషన్ ఇవ్వవలసి ఉంటుందని సదరు కాపీని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నందు, ఏఆర్ఓ, గ్రామపంచాయతీ, వార్డు సచివాలయం, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ రిక్వైర్మెంట్స్, ఈవీఎం లు పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటు కొరకు పూర్తి ప్రణాళిక సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతి సహాయ రిటర్నింగ్ అధికారి వారి పరిధిలోని ఎస్ హెచ్ ఓ తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని, అలాగే రిటర్నింగ్ అధికారులు వారి పరిధిలోని డీఎస్పి తదితర పోలీస్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయపరచుకొని చెక్ పోస్టు నందు సీజ్ చేసిన మొత్తం లిక్కర్ నగదు డ్రగ్స్ తదితర అంశాలపై వివరాలు, ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి బృందాలు సీజ్ చేసిన వాటిని సంబంధిత నియోజకవర్గ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లు సంబంధిత రిటర్నింగ్ అధికారుల ద్వారా జిల్లా ఎక్స్పెండిచర్ నోడల్ అధికారికి పంపేలా ఒకే రకమైన సమాచారం అందుబాటులో ఉండేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 12వ తేదీన ఈవిఎం ర్వాండమైజేషన్ ఉంటుందని, సదరు స్ట్రాంగ్ రూమ్ వద్ద ఈవీఎం భద్రపరచు ప్రాంతంలో తగినంత బందోబస్తు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు నియోజకవర్గస్థాయిలో త్వరలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తిస్థాయి అవగాహనతో చేపట్టాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పన నిబంధనల మేరకు పూర్తిస్థాయిలో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతగా ఎన్నికలను విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి గారు అందరికీ అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్, ఈఆర్ఓ లు మున్సిపల్ కమిషనర్ తిరుపతి అదితి సింగ్, కిరణ్ కుమార్, నిశాంత్ రెడ్డి, నరసింహులు, జిల్లా నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సెప్టెంబర్ 27న రాజమహేంద్రవరంలో అంగరంగ వైభవంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు:రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

-సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దుర్గేష్ కీలక సమీక్ష.. గోదావరి పుష్కరాలు, ఇన్-బౌండ్ టూరిజం వృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *