Breaking News

విజయవాడ “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి

-సీఎం జగన్ పై రాయితో దాడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. విజయవాడ “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్‌ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది.  అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్‌ కనుబొమ్మకు తాకింది. సీఎం జగన్‌పై క్యాట్‌ బాల్‌తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయి తగలడంతో సీఎం జగన్‌ ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది. సీఎం జగన్‌  పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది. వెంటనే సీఎం జగన్‌కు బస్సులో ప్రథమ చికిత్స అందించారు వైద్యులు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్నారు సీఎం జగన్‌. విజయవాడలో సీఎం జగన్‌ కోసం జనం పోటెత్తారు. విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా సీఎం జగన్‌ బస్సుయాత్ర అప్రతిహతంగా భారీ రోడ్‌ షో కొనసాగుతోంది. సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారని విజయవాడ వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *