Breaking News

ఎన్నికల విధులు తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధులు కేటాయించబడిన పి.ఓ మరియు ఏ.పి.ఓ ల ట్రైనింగ్ సెంటర్ ను పరిశీలించిన నగర కమీషనర్ మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆ.ఓ) కీర్తి చేకూరి. 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పి.ఓ లు మరియు ఏ.పి.ఓలుగా ఎన్నికల విధులు కేటాయించబడిన వారికి ఈ నెల 15 మరియు 16 తారీఖులలో తొలివిడత ట్రైనింగ్ ను ఏ.సి కళాశాల నందు ఏర్పాటు చేయగా సదరు నిర్వహణ ఏర్పాట్లను ఆదివారం అధికారులతో కలిసి కమీషనర్ పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమీషనర్ మరియు రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ, ఎన్నికల కమీషన్ వారి ఆదేశాల మేరకు పి.ఓలు మరియు ఏ.పి.ఓ లుగా విధులు కేటాయించబడిన వారికి ఈ నెల 15,16 తారీఖులలో ఏ.సి కాలేజిలోని మొదటి అంతస్తునందలి లైబ్రరీ బిల్డింగ్ నందు మాస్టర్ ట్రైనర్ల ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియచేశారు. శిక్షణకు హాజరయ్యే పి.ఓ మరియు ఏ.పి.ఓ ల హాజరు ఉదయం మరియు మధ్యాన్నం తప్పనిసరిగా స్వీకరించిచుట జరుగుతుందని, కావున విధులు కేటాయించబడిన తేదీలలో విధిగా శిక్షణ తరగతులకు హాజరు కావాలన్నారు. శిక్షణ తరగతులకు హాజరయ్యే వారి కొరకు రూముల వారీగా ప్రత్యేక టేబుల్స్ మరియు సిబ్బందిని కేటాయిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామన్నారు. పి.ఓ లకు శిక్షణ సమయంలో పి.ఓ డైరీ మరియు ఇతర మెటీరియల్ శిక్షణ కేంద్రం వద్ద అందజేయుట జరుగుతుందన్నారు. ఎన్నికల ఉత్తర్వులతో పాటు అందించిన పోస్టల్ బ్యాలెట్ ఫారం 12 ను స్వీకరించుట జరుగుతుందని, అందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు అర్హత ఉన్నవారు, వారి ఓటర్ గుర్తింపు కార్డ్ నకలు, ఎన్నికల విధుల ఉత్తర్వుల నకలుతో కలిపి ఫారం 12 పోస్టల్ బ్యాలెట్ అర్జీలను మీకు కేటాయించిన టేబుల్ నందు అందజేయాలన్నారు. అలాగే ఇంజనీరింగ్ అధికారులు విద్యుత్, శిక్షణకు యల్.ఈ.డి టి.వి లు త్రాగు నీరు వంటి మౌలిక సదుపాయాలు మరియు సదుపాయాలూ ఏర్పాటు చేయాలన్నారు. పట్టణ ప్రణాళిక విభాగం వారు ఏ.సి కాలేజీ ప్రధాన గేటు దగ్గర సమాచార బ్యానర్లను, గేటు నుండి రూముల వరకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. శానిటరీ విభాగం వారు రూములు టాయిలెట్ లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
సదరు కార్యక్రమంలో ఏ.ఆర్.ఓ వెంకట లక్ష్మి,సిటీ ప్లానర్ ప్రదీప్,డి.ఈ.ఈ రమేష్ బాబు, ఏ.ఈ సునీల్, యస్.యన్. ప్రసాద్, పద్మనాభరావు, శివన్నారాయణ, రెహమాన్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *