విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ విష్ణువర్జల అనంతరామ కృష్ణ ప్రసాద్ (అమ్మ ప్రసాద్), వైఎస్సార్ సీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆయన ఆధ్వర్యంలో జరిగిన విలేఖరుల సమావేశంలో విష్ణువర్జల అనంతరామ కృష్ణ ప్రసాద్ (అమ్మ ప్రసాద్) మాట్లాడుతూ…నేను సీఎం చేత నియమింపబడ్డానని, నాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదని, నేను సామాన్యుని అని, ఈ పదవి ఇచ్చినందుకు సీఎం కి కృతజ్ఞతలు అని అన్నారు. నేను రాజశేఖర్ రెడ్డి అభిమానిని 2018 సంవత్సరం నుంచి వైఎస్ఆర్సిపి లో పనిచేయాలని సోషల్ మీడియా ద్వారా జగన్ ని పొగుడుతూ 175 ఎమ్మెల్యే 25 ఎంపీలు సీట్లు గెలవాలని వేద పండితులు చేత పూజలు చేపించానని, నాకు సోషల్ మీడియాలో పట్టు ఉన్నందున, వాక్కు చాతుర్యం ఉన్నందున, నేను సోషల్ మీడియాని వేదికగా ఎంచుకున్నానని, దీనికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని, నేను ఏప్పుడు కూడా పార్టీ నుండి సహాయం పొందలేదని, నేను చేయమని అడగలేదని అన్నారు. నా క్రియేటివిటీని సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా చైర్మన్ గా వచ్చినాక మమ్మల్ని పట్టించుకోలేదన్నారు. నన్ను సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడు కూడా సీఎంని కలవనీలేదని, ఈ పార్టీలో వర్త్ ఉన్న వాళ్ళని తొక్కి వేస్తారని, నిన్ననే పార్టీకి, పదవికి రాజీనామా చేశానని, నా రాజీనామా లేఖను సజ్జల రామకృష్ణారెడ్డికి, వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసుకి పంపించానని, ఈ ప్రభుత్వం సంక్షేమం అంటూ సంక్షోభం చేస్తుందని, ఏ ప్రభుత్వము లిక్కర్ వ్యాపారం, ఇసుక వ్యాపారం చేయదని, సీఎం కోటరీ దాటి బయటికి రావటం లేదని, ఇది పార్టీ లాగా అనిపించలేదన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ వ్యాపార సంస్థ అని, రేపు జరగబోయే ఎన్నికలలో నెల్లూరు జిల్లా నుండి శ్రీకాకుళం వరకు సునామీ లాంటి వార్త వింటారని అన్నారు. ఓట్లు అమ్ముకుంటే మీరు ఉరితాడు బిగించుకున్నట్లేనని, మంచివారిని రాజకీయాల్లోకి రాకుండా సామాన్యులుగా చేస్తున్నారని, ఓటు అమ్ముకుంటే వళ్ళు అమ్ముకున్నట్లేనని, అన్యాయం పోవాలని, నిజం గెలవాలని, వ్యాపారాలు చేసే ప్రభుత్వాలు ఉండకూడదని, అవినీతిపరులు సామాన్యుల రక్తాన్ని జలగల పీలుస్తున్నారని, నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని రెండు చోట్ల ఓడిపోయిన ప్రజల్లోనే ఉన్నాడని, తన సొంత డబ్బులు పార్టీకి ఖర్చు పెడుతున్నాడని, విలాసవంతమైన జీవితాన్ని వదిలి ప్రజల్లో ఎండల్లో తిరుగుతున్నాడని, అందుకని నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని రేపు కనకదుర్గమ్మ అమ్మవారు గుడికెళ్లి దర్శనం చేసుకుని నా భవిష్యత్తు నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నారు.
Prajavartha Online Telugu News