గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధులలో పాల్గొంటున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకొనుటకు నేడే (ఏప్రిల్ 26) చివరి రోజని నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కె.రాజ్యలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ని తొలుత ఈ నెల 22వ తేదీలోపు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిందని, ప్రస్తుతం 26వ తేదీ వరకు గడువు పొడిగించిందని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజక వర్గం (94) పరిధిలో ఎన్నికల ప్రక్రియలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, ఉద్యోగేతరులు (వీడియోగ్రాఫర్స్, డ్రైవర్లు మొదలుగు వారు) వారి యొక్క ఓటు ఏ నియోజకవర్గంలో ఉన్నప్పటికిని, జిఎంసిలోని ఎలక్షన్ సెల్ నందు ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ వద్ద ఫారం-12 కు సంబందించిన వివరాలు అందించాలని తెలియచేశారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఈ నెల 26 వ తేదీ శుక్రవారం లోపు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎలక్షన్ సెల్ నందు ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ డెస్క్ లో ఫారం-12 (2 కాపీలు) అందించాలని తెలిపారు. ఫారం-12తో పాటుగా ఓటర్ ఎపిక్ కార్డ్ కాపీ, డ్యూటీ ఆర్డర్ కాపి తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ సిబ్బంది కార్యాలయ పని వేళల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉంటారని తెలిపారు.
Tags guntur
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News