Breaking News

ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్నాం

-ఓటింగ్ తేదీ ముందు 72 గంటలు అత్యంత జాగ్రత్త వ్యవహరించాలి
-నిఘా వ్యవస్థ ప్రత్యేక దృష్టి పెట్టాలి
-ఫిర్యాదుల విషయంలో హేతుబద్ధత కలిగి ఉండాలి
-సువిధా అనుమతులు తప్పనిసరి పాటించేలా చూడాలి
-జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారుల పనితీరు సంతృప్తికరం
-ఓటర్ల స్లీప్ జారీ లో బి ఎల్ వో విధులపై ప్రత్యక్ష పర్యవేక్షణ వుండాలి
-ఎన్నికల కార్యచరణ ప్రణాళికా ముందస్తుగా రాజకీయ పార్టీల తెలపాలి
-ఓటర్లను చైతన్యం తీసుకుని వొచ్చి ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలి
-ఎన్నికల పరిశీలకుల బాల సుబ్రహ్మణ్యమ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు 2024 కు కీలక ఘట్టం చేరుకున్న దృష్ట్యా ఎన్నికల యంత్రాంగం విధి నిర్వహణలో మరింత ఖచ్చితత్వం, నిబద్దత కలిగి ఉండాలని, ఓటర్లను ప్రభావితం చేసే వాటిపై నిఘా పెట్టాలని రాజమండ్రీ పార్లమెంటు నియోజక వర్గ సాధారణ పరిశీలకులు కే. బాలసుబ్రమణ్యం స్పష్టం చేశారు.

స్ధానిక కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఉదయం ఎన్నికల సాధారణ , వ్యయ, పోలీసు పరిశీలకులు జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులతో విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించారు.

తొలుత కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ లో భాగంగా జిల్లాలో చేపట్టిన ప్రణాళిక వివిధ బృందాలు నిర్వహిస్తున్న విధులు పై సమగ్ర సమాచారం అందచేశారు. జిల్లాలో 7 నియోజక వర్గాల పరిధిలో 1577 పొలింగ్ కేంద్రాల, 1623149 మంది ఓటర్లు ఉన్నారని, వాటిలో 19,754 దివ్యంగా ఓటర్లు, 8, 294 మంది 85 ప్లస్ ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో 1577 పిఎస్ లలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా ఆర్వో, ఏ ఆర్వో లు తనిఖీలు చేశారన్నారు. జిల్లాలో 21 మోడల్, రెండు యూత్, ఏడు మహిళా, రెండు దివ్యంగా ఓటర్లు కోసం ప్రత్యేక పొలింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 23 ఎమ్ సి సి బృందాలను నియమించామని ఎంసిసి ఉల్లంఘన కింద ప్రభుత్వ ఆస్తుల పై 41 వేలు, ప్రవేటు ఆస్తులపై 4836 సంభందించి తొలగించడం జరిగిందన్నారు. సి విజిల్ యాప్ 600 కాల్స్ వచ్చాయని 457 పరిష్కారం చేశామని, 128 కేవలం సమాచార సంబంధ మైనవి అని పేర్కొన్నారు. సువిధా ద్వారా 968 అనుమతులలో 820 జారీ చెయ్యగా 116 తిరస్కరించడం జరిగిందని, 32 పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. అనంతరం రిటర్నింగ్ అధికారులు, ఆయా విభాగాల నోడల్ అధికారులు సమగ్ర సమాచారాన్ని అందచేశారు.

అనంతరం సాధారణ ఎన్నికల పరిశీలకులు కే. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఎన్నికలను పారదర్శకంగా, ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలన్నారు. ఓటింగ్ శాతం పెరిగేలా ఓటర్లు పెద్ద ఎత్తున పొలింగ్ కేంద్రాల కి వచ్చెలా స్వీప్ కార్యకలాపాలను చేపట్టాలన్నారు. పొలింగ్ రోజున ఆరు గంటలకు లైన్ లో నిలబడిన చివరి వ్యక్తి నుంచి స్లీప్ ఇచ్చి, వారందరూ ఓటు హక్కు వినియోగించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఓటర్ స్లిప్స్ జారీ బి ఎల్ వో లు వ్యక్తిగతంగా ఓటర్లకు అందచేయాలని, ఆర్వో లు బీ ఎల్ వో ల పనితీరును పర్యవేక్షణా చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియ చేపడుతున్న కార్యకలాపాలు ముందస్తుగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాచారం అందచెయ్యలన్నారు. నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన దృష్టా, ఏప్రియల్ 30 న పోటిలో నిలిచే అభ్యర్థులతో సమావేశం నిర్వహించాలన్నారు.

మరో ఎన్నికల సాధారణ పరిశీలకులు కమల్ కాంత్ సరోఛ్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి చెయ్య దగిన, చెయ్య కూడని వాటిపై అవగాహన కల్పించడం కీలకం అన్నారు. ఆమేరకు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం కరపత్రాలు ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఓటర్ల స్లీప్ లో ఖచ్చితంగా ఎపిక్ సంఖ్య మాత్రమే రాయాలని తెలిపారు. ఉచితాలి, నగదు పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేసే వాటిపై దృష్టి సారించాలన్నారు.

పోలీసు పరిశీలకులు బలరామ్ మీనా మాట్లాడుతూ, స్ట్రాంగ్ రూమ్ వద్ద, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతకట్టుదిట్టం చెయ్యాలని, 24 x 7 సీసీ కెమెరాలు పర్యవేక్షణ చెయ్యలన్నారు. విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడడం, బ్యాక్ అప్ వ్యవస్థ ను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు అనుగుణంగా ముందస్తుగా ఏర్పాటు చెయ్యాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో ఓటింగు శాతం పై పట్టణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడం ద్వారా చైతన్యం తీసుకుని రావాలని తెలిపారు. భద్రత పరంగా క్రిటికల్ పొలింగ్ కేంద్రాల వద్ద వీడియో గ్రాఫి నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు మాధవీలత తెలియ చేశారు.

వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్, జై అరవింద్, నితిన్ కురియన్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అభ్యర్ధులు చెసే ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు ఆడిటింగ్ బృందానికి అందచెయ్యలన్నారు. పత్రికల్లో, టీవీల్లో, వివిధ సామాజిక మాధ్యమాల్లో వొచ్చే  ప్రచారం ఖర్చులను, సువిధ అనుమతుల ఖర్చులను అందచెయ్యలన్నారు. ఆ ఖర్చులను అభ్యర్థుల ఖాతా లో చూపి, నోటీసు జారీ చేయాలన్నారు.

ఎస్పీ పి జగదీష్ మాట్లాడుతూ, జిల్లాలో 16 సమీకృత శాఖల ద్వారా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. తొలుత ఎనిమిది సమీకృత చెక్ పోస్ట్ లని ఏర్పాటు చేశామని, తదుపరి మరో ఎనిమిది చెక్ పోస్ట్ లని ఏర్పాటు చేసినట్లు ఎస్పి పి. జగదీష్ తెలిపారు. పోలీస్, రెవిన్యూ, రవాణా, అటవీ, సెబ్, ఎక్సైజ్ తదితర శాఖల ఆధ్వర్యంలో సమ్మిళితం చేసి ఏకీకృత శాఖల ఉద్యోగులు నియమించి నట్లు తెలిపారు. తనిఖీలు, సీజ్ చెసే విధానం వీడియో రికార్డింగ్ చెయ్యడం జరుగుతున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో రోహిత్ నగర్, జై అరవింద్, నితిన్ కురియన్ జై అరవింద్ , రిటర్నింగ్ అధికారులు, ఇతర నోడల్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *