Breaking News

గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో చేపట్టిన స్వీప్ అవగాహన కార్యక్రమాల ఛాయాచిత్ర ఆల్బమ్ ను ఆవిష్కరించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
120-గూడూరు (ఎస్ సి) అసెంబ్లీ నియోజకవర్గంలో చేపట్టిన స్వీప్ అవగాహన కార్యక్రమాల ఛాయాచిత్ర ఆల్బమ్ ను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ గారు గూడూరు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆదివారం ఆర్.ఓ కిరణ్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గూడూరు ఆర్డీఓ గారు కలెక్టర్ కు వివరిస్తూ గూడూరు నియోజక వర్గంలోని బూత్ లెవెల్ స్థాయి, మండల స్థాయిలో, నియోజక వర్గ స్థాయిలో పలు ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఓటు హక్కు గల ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును మే13 న వినియోగించుకునేలా వారికి మోటివేట్ చేయడం జరిగిందని, యువ ఓటర్లు నమోదు, పోలింగ్ శాతం పెంపు లక్ష్యంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ఓ లు, తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *