Breaking News

ప్రజాస్వామ్య ఎన్నికల విధుల నిర్వహణలో పాల్గొనడం ఎంతో గొప్ప అవకాశం

-జిల్లా ఎన్నికల యంత్రాంగం ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చేపడుతున్న చర్యలు అభినందనీయం: రాష్ట్ర ప్రత్యేక సాధారణ పరిశీలకులు రామ్ మోహన్ మిశ్రా
-ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నాం: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్య ఎన్నికల విధులు నిర్వహణలో పాల్గొనడం ఎంతో గొప్ప అవకాశమని, నిష్పాక్షిక పారదర్శక ఎన్నిక‌లు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఎస్పి కృష్ణ కాంత్ పటేల్ నిర్వహణకు అన్ని చర్యలు ప్రణాళికా బద్ధంగా చేపడుతున్నారని ఎలాంటి హింసాత్మక, రీ పోల్ ఘటనలకు తావివ్వకుండా ఎన్నికల మార్గదర్శకాల మేరకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని భారత ఎన్నికల కమిషన్ చే నియమించబడిన రాష్ట్ర ప్రత్యేక సాధారణ ఎన్నికల పరిశీలకులు రాంమోహన్ మిశ్రా పేర్కొన్నారు.

మంగళవారం ఉదయం తిరుపతి జిల్లాకు భారత ఎన్నికల కమిషన్ నుండి ఆం.ప్ర రాష్ట్రానికి కేటాయించబడిన ప్రత్యేక సాధారణ పరిశీలకులు తిరుపతి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న చర్యలపై సన్నద్ధతపై 23- తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు కే. జ్యోతి, కైలాస్ వాంఖడే, పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వే లతో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రత్యేక సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య ఎన్నికల విధుల నిర్వహణలో పాల్గొనడం ఎంతో గొప్ప అవకాశమని, నిష్పాక్షిక పారదర్శక ఎన్నిక‌లు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పి అన్ని రకాల చర్యలు ప్రణాళికా బద్ధంగా ఎలక్షన్ కమిషన్ టైం లైన్ మేరకు, నిబంధనల మేరకు చేపడుతున్నందుకు వారిని అభినందిస్తున్నాను అని అన్నారు. ఎలాంటి హింసాత్మక, రీ పోల్ ఘటనలకు తావివ్వకుండా ఎన్నికల మార్గదర్శకాల మేరకు డీఈఓ మొదలు బిఎల్వో దాకా అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని సూచించారు. ఎన్నికల విధులలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ భారత ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉన్నామని గుర్తెరిగి ఎవరి బాధ్యత వారు 100% నిబద్ధతతో పనిచేసి, స్వేచ్ఛాయిత వాతావరణంలో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పోలింగ్ రోజున మే 13న తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక, వల్నరబుల్ పోలింగ్ కేంద్రాల పరిధిలో క్షేత్రస్థాయి నుండి ఎప్పటికప్పుడు సమాచారం అందేలా సమీక్షించుకుని తెలిపారు తగు చర్యలు చేపట్టాలని అన్నారు. అక్రమ మద్యం, నగదు, డ్రగ్స్ తదితరాలు రవాణా, పంపిణీ జరగకుండా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు, వివిధ తనిఖీ బృందాలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే అట్టి వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలో నిష్పాక్షిక పారదర్శక ఎన్నికల నిర్వహణకు పటిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నాం: జిల్లా క‌లెక్ట‌ర్
స‌మావేశంలో భాగంగా ముందుగా క‌లెక్ట‌ర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షికంగా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చేప‌ట్టిన చ‌ర్య‌ల గురించి రాష్ట్ర ప్రత్యేక సాధారణ పరిశీలకులకు వివ‌రించారు. జిల్లాలో 18,12,980 మంది ఓటర్లు ఉన్నారని, అందులో మహిళలు 9,29,466 మంది కాగా పురుషులు 8,83,330 మంది ఉన్నారని, ట్రాన్స్ జెండర్ 184 మంది, పీడబ్ల్యుడి ఓటర్లు 24,596 మంది ఉన్నారని, సర్వీస్ ఓటర్లు 862 మంది, మొదటిసారి ఓటు హక్కు కలిగిన వారు (18-19 సం.), 85 సం. లపైబడిన వారు 7924 మంది ఉన్నారని వివరించారు. జిల్లాలో 2130 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాలు 10 కలిపి మొత్తం 2140 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని,పోలింగ్ స్థానాలు 1387 ఉన్నాయని అందులో 696 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, 15 వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. కనీస మౌలిక సదుపాయాలు పోలింగ్ కేంద్రాలలో కల్పించడంతో పాటు షేడ్, వీల్ చైర్స్, ర్యాంపు, మెడికల్ టీమ్ ఫ్లూయిడ్స్, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా మేరకు చంద్రగిరి, తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గాలకు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి అదనపు బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయని తెలిపారు. ఆ మేరకు సిఈఓ కార్యాలయం, బెల్ ఇంజనీర్లతో సమన్వయము చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ పార్టీ 1 + 5 ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 7చోట్ల అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు, 6 అంతర్ జిల్లాల చెక్ పోస్టులు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు 2 ఏర్పాటుతో, ఎస్ఎస్టి, ఎఫ్ఎస్టీ, జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృంద ఏర్పాటుతో విసృత త‌నిఖీలు చేప‌డుతున్నామ‌ని పేర్కొన్నారు. 16 నోడల్ ఆఫీసర్లను నియమించామని సంబంధిత అంశాలపై వారి విధులను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. కమ్యూనికేషన్ ప్లాన్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్ తదితరాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సీ-విజిల్ ద్వారా, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఫిర్యాదులను నిర్ణీత స‌మ‌యంలో ప‌రిష్క‌రించామ‌ని వెల్ల‌డించారు. జిల్లా గ్రీవెన్స్ కమిటీ(డిజిసి) ఏర్పాటు చేశామని ప్రతి రోజు రెండు సార్లు కమిటీ సమావేశమై సాధారణ పౌరుల వ్యాపారులకు సంబంధించిన నగదు సీజ్ అయి ఉంటే వాటి రికార్డులను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మేరకు పరిశీలించి సరిగా ఉంటే వారికి తిరిగి సొమ్మును వాపసు ఇవ్వడం జరుగుతోందని, ఇప్పటి వరకు డిజీసి నుండి 44 కేసులకు గాను రూ. 83.78 లక్షలు సీజ్ చేసిన మొత్తం నుండి 43 కేసులను పరిష్కరించి రూ. 82.89 లక్షలను సంబంధిత వ్యక్తులకు సదరు సీజ్ చేసిన మొత్తాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు.

ఎస్పీ మాట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు ధ‌న రూపేణా రూ.1.52 కోట్లు, మద్యం విలువ రూ. 51.97 లక్షలు అనీ, ఫ్రీబిలు, విలువైన లోహాలు వంటివి అన్నీ కలిపి వెరసి మొత్తం 19.65 కోట్ల విలువైన వాటిని సీజ్ చేశామ‌ని, ఈఎస్ఎంఎస్ నందు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 24X7 క్షేత్ర స్థాయిలో ప‌ని చేస్తున్నాయ‌ని, న‌గ‌దు త‌ర‌లింపు, మ‌ద్యం ర‌వాణాపై నిఘా ఉంచుతున్నాయ‌న్నారు. 24*7 పని చేసేలా కంట్రోల్ రూమ్ నుంచి సేవ‌లందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుండి 774 కేసులు నమోదు చేయడం జరిగిందని వీటిలో 18 కేసులపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయడం జరిగిందని, 10 కేసులపై చార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగిందని మిగిలిన 600 కేసులు దర్యాప్తు లో ఉన్నాయని మరి కొన్ని రోజులలో వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. వెపన్స్ కు సంబందించి 505 ఉంటే 503 డిపాజిట్ చేయించామని మిగిలిన రెండు లైసెన్సులు రద్దు చేసామని తెలిపారు. ఎన్నికలకు కేటాయించిన కేంద్ర బలగాలను అన్ని నియోజకవర్గాలకు కేటాయించడం జరిగిందని తెలిపారు.

ఈ సమావేశంలో జెసి ధ్యాన చంద్ర హెచ్ఎం, మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, డిఆర్ఓ పెంచల కిషోర్, అదనపు ఎస్పీ వెంకట్రావు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, జిల్లా నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *