-బ్యాంక్ అకౌంట్లు లేని వారికి సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పెన్షన్ ల పంపిణీ
-జిల్లాలో 2,70,390 మంది లబ్దిదారులకు సుమారు రూ.80.48 కోట్లు పంపిణీ: జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి, ఏప్రిల్ 30: జిల్లాలో 2,70,390 మంది లబ్దిదారులకు సుమారు రూ.80.48 కోట్లు పంపిణీ మే1 నుండి పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఈసిఐ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం దృష్ట్యా ఏప్రిల్ మాసానికి చెందిన మే నెలలో పంపిణీ చేయాల్సిన సామాజిక పెన్షన్ నగదును ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్లు ఉన్న లబ్దిదారులకు డిబిటి ద్వారా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందని, సచివాలయాలకు వారు పెన్షన్ కొరకు రానవసరం లేకుండా ఆధార్ నెంబర్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లకు పెన్షన్ లను డిబిటి పద్ధతి ద్వారా నేరుగా జమ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. జిల్లాలో వివిధ పెన్షన్ ల కింద మే నెలలో 2,70,390 మంది లబ్దిదారులకు సుమారు రూ.80.48 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా, 2,00,868 లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లు ఆధార్ నెంబర్ తో లింక్ అయి ఉన్నాయని, వీరికి డిబిటి ద్వారా మే 01 వ తేదిన పెన్షన్ నగదు జమ చేయడం జరుగుతుందని, మిగిలిన 69,522 మందికి సైతం మే 01 వ తేదీనే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షనర్ల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ పంపిణీ కార్యక్రమం ఎంపిడిఓ, మునిసిపల్ కమిషనర్ ల ఆధ్వర్యంలో నిర్దేశించిన సచివాలయ పరిధిలో ఆయా సచివాలయ సిబ్బంది ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. నగదు పంపిణీలో సాంకేతిక కారణాల ద్వారా బ్యాంక్ అకౌంట్ల కు నగదు జమ కాని పక్షంలో మే 01 వ తేది తరువాత పెన్షన్ దారుల ఇంటి వద్దకు వెళ్లి సచివాలయం అధికారుల ద్వారా నగదు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ నగదు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంక్ ల వద్ద ప్రత్యేక కౌంటర్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ ల పంపిణీ పై పూర్తి పర్యవేక్షణ ఉంటుందని, వీలైనంత త్వరగా పెన్షన్ ల పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కావున సామాజిక భద్రత పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ కొరకు వ్యయ ప్రయాసలకోర్చి సచివాలయానికి రానవసరం లేదని తెలిపారు.
Prajavartha Online Telugu News