విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
64 డివిజన్ లో భారీగా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సిపి లో 30 కుటుంబాలు చేరికలు జరిగాయి. బుధవారం ఆర్కే మరియు భక్తుల శేఖర్ ఆధ్వర్యంలో వైయస్సార్సీపీలో ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ తో కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ పాలనపై ప్రజానీకం పూర్తి విశ్వాసంతో ఉన్నారని… స్వచ్ఛమైన మనసుతో ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ను కులమత వర్గాల కతీతంగా ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని తెలియజేశారు. వైసీపీ అభ్యర్థులందరూ కచ్చితంగా మంచి మెజార్టీలతో విజయం సాధించబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎం శివమణి, కే ప్రసాద్, ఎం విజయ్, కే రవి కిరణ్, ఆర్ బాబురావు, ఆర్ రామకృష్ణ, బి శర్వాన్, ఎం మధు సేన, పి ఎలీషా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News