– చెక్ పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలి.
– పోలీస్ పరిశీలకులు ప్రీతీందర్ సింగ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల సరిహద్దులోని తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తిరువూరు ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్, మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్స్ మిల్లి చెక్ పోస్ట్ లను బుధవారం అబ్జర్వర్ ప్రీతిందర్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈనెల 13 వ తేదీన పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో డబ్బు, మద్యం అక్రమ రవాణ జరుగకుండా పోలీస్ సిబ్బంది గట్టి నిఘా ఉంచాలని తెలిపారు. ఇరువైపులా వచ్చి పోయే వారిని పూర్తిగా తనిఖీ చేసిన తరువాతే విడిచి పెట్టాలన్నారు. అధిక మొత్తంలో నగదు ధ్రువీకరణ పత్రాలు లేకుండా రవాణ జరుగుతుంటే స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద రికార్డులు తనిఖీ చేశారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ పరిశీలకులు ప్రతింధర్ సింగ్ అన్నారు.
Prajavartha Online Telugu News