Breaking News

అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ఈవీఎంల రెండో ర్యాండ‌మైజేష‌న్‌

– ఎక్క‌డా ఎలాంటి పొర‌పాట్ల‌కు తావులేకుండా విజ‌య‌వంతంగా ప్ర‌క్రియ‌
– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 13న పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ఈవీఎంల రెండో ర్యాండ‌మైజేష‌న్ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించిన‌ట్లు జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.
బుధ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్లు మంజూ రాజ్‌పాల్‌, న‌రీంద‌ర్‌సింగ్ బాలి స‌మ‌క్షంలో జిల్లా క‌లెక్ట‌ర్ డిల్లీరావు ఆధ్వ‌ర్యంలో ఈవీఎంల రెండో ర్యాండ‌మైజేష‌న్ ప్ర‌క్రియ నిర్వ‌హించారు. రిట‌ర్నింగ్ అధికారుల‌తో పాటు ఎల‌క్ష‌న్ ఏజెంట్లు, అభ్య‌ర్థులు, అభ్య‌ర్థుల ప్ర‌తినిధులు త‌దిత‌రులు హాజ‌రుగా కాగా ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ తొలి ర్యాండ‌మైజేష‌న్ ద్వారా ఈవీఎంల‌ను నియోజ‌క‌వ‌ర్గాల‌కు కేటాయించ‌గా.. బుధ‌వారం రెండో ర్యాండ‌మైజేష‌న్ ద్వారా ఈవీఎంల‌ను ఆన్‌లైన్ ద్వారా పోలింగ్ స్టేష‌న్ల‌కు అనుసంధానించిన‌ట్లు తెలిపారు. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గానికి 280 బ్యాలెట్ యూనిట్లు, 280 కంట్రోల్ యూనిట్లు, 304 వీవీప్యాట్లు కేటాయించిన‌ట్లు వెల్ల‌డించారు. అదే విధంగా విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి 303 బీయూలు, 303 సీయూలు, 328 వీవీప్యాట్లు; విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి 642 బీయూలు, 321 సీయూలు, 346 వీవీప్యాట్లు; విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి 357 బీయూలు, 357 సీయూలు, 387 వీవీప్యాట్లు కేటాయించిన‌ట్లు వివ‌రించారు. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి 354 బీయూలు, 354 సీయూలు, 383 వీవీప్యాట్లు; నందిగామ‌కు 266 బీయూలు, 266 సీయూలు, 288 వీవీప్యాట్లు; జ‌గ్గ‌య్య‌పేట‌కు 266 బీయూలు, 266 సీయూలు, 288 వీవీప్యాట్లు కేటాయించిన‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు.

ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిపై దృష్టిసారించాలి: జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్లు మంజూ రాజ్‌పాల్‌, న‌రీంద‌ర్ సింగ్ బాలి
వివిధ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో పోటీలో నిలిచిన అభ్య‌ర్థులు ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్లు మంజూ రాజ్‌పాల్‌, న‌రీంద‌ర్ సింగ్ బాలిలు సూచించారు. తాము ప్ర‌తిరోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి 4 గంట‌ల వ‌ర‌కు మునిసిప‌ల్ గెస్ట్ హౌస్‌, బృందావ‌న్ కాల‌నీ, ల‌బ్బీపేట‌, విజ‌య‌వాడ‌లో అందుబాటులో ఉంటామ‌ని.. రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు, అభ్య‌ర్థులు, ప్ర‌జ‌లు ఎన్నిక‌ల ఉల్లంఘ‌న‌ల‌కు సంబంధించి ఫిర్యాదులు, విజ్ఞాప‌న‌ల‌ను నేరుగా క‌లిసి స‌మ‌ర్పించ‌వ‌చ్చ‌న్నారు. అదే విధంగా మీడియా ద్వారా వెల్ల‌డించిన ఫోన్ నంబ‌ర్ల ద్వారా సంప్ర‌దించ‌వ‌చ్చ‌న్నారు. ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో శాంతియుత వాతావ‌ర‌ణంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు అంద‌రూ కృషిచేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని పేర్కొన్నారు. సువిధ యాప్ ద్వారా అనుమ‌తులు, సీ-విజిల్ ద్వారా ఫిర్యాదుల స్వీక‌ర‌ణ, ఈసీఐ డిజిట‌ల్ వేదిక‌లు త‌దిత‌రాల‌పై జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్లు అవ‌గాహ‌న క‌ల్పించారు. కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ శుభం నోఖ్వాల్, ఆర్‌వోలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *