– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యా, వైద్య రంగాలలో నూతన ఒరవడులు తీసుకువచ్చి ఎన్నో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి నిండు మనస్సుతో ఆశీర్వదించాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. వెలంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 63వ డివిజన్ ఉడాకాలనీలో శనివారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. వెలంపల్లి సోదరుడు వెలంపల్లి రాఘవతో ఇంటింటికి వెళ్లి ఈ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు చెప్పినవన్నీ చేసి చూపామని.. కనుకనే యుద్ధానికి సిద్ధమని సీఎం జగన్ పిలుపునిచ్చినట్లు మల్లాది విష్ణు చెప్పారు. ఈ ప్రభుత్వం సాధించిన విజయాలపై ఏ వేదికపైన అయినా తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు.
ఐదేళ్లలో అక్షరాల రూ. 74.68 కోట్ల సంక్షేమం
వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా డివిజన్లో ప్రతి నెలా 2,482 మందికి ఇంటి వద్దకే ఠంఛన్ గా పింఛన్ అందజేయడం జరుగుతోందని మల్లాది విష్ణు తెలిపారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 3,559 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 12.72 కోట్లు., అమ్మఒడి పథకం ద్వారా 2,726 మంది తల్లులకు రూ. 8.92 కోట్లు., చేదోడు ద్వారా 223 మందికి రూ. 46.10 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 162 మందికి రూ. 39 లక్షలు., జగనన్న విద్యాదీవెన ద్వారా 1,291 మందికి రూ. 3.24 కోట్లు., వసతి దీవెన ద్వారా 1,185 మందికి రూ. 1.27 కోట్లు., కాపు నేస్తం ద్వారా 187 మందికి రూ. 60 లక్షలు., సున్నావడ్డీ పథకం ద్వారా 4,243 మందికి రూ. 1.69 కోట్లు., వైఎస్సార్ చేయూత ద్వారా 965 మందికి రూ. 3.60 కోట్ల సంక్షేమాన్ని డివిజన్ ప్రజలకు అందజేసినట్లు చెప్పారు.
రాజీవ్ నగర్ అభివృద్ధిపై చెరగని సంతకం
గత ఐదేళ్లలో డివిజన్లో రూ. 15 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తూ.. ముందుకు వెళ్లినట్లు తెలిపారు. రూ.1.25 కోట్ల వ్యయంతో హోసన్నా మందిరం రోడ్డు., రూ.1.20 కోట్ల వ్యయంతో డాక్టర్స్ కాలనీ రోడ్లను పూర్తిచేసుకోవడం జరిగింన్నారు. EWS కాలనీలో రూ. 1.50 కోట్లతో రహదారులు నిర్మించుకోగా.. రూ. 80 లక్షలతో LIG – 1, 2., MIG – 1 కాలనీలలో రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు. అలాగే 6 వార్డు సచివాలయాల పరిధిలో మంజూరైన రూ. 1.20 కోట్ల గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో రాధానగర్ కాలేజీ రోడ్డు, ఎన్జీఓస్ E కాలనీ, విశాలాంధ్ర కాలనీ, షణ్ముఖ వాటర్ ప్లాంట్ రోడ్డు, మాస్టర్ మైండ్స్ స్కూల్ రోడ్డు సహా అనేక రహదారులకు మోక్షం లభించినట్లయిందన్నారు. సుందరయ్యనగర్లో రూ. 30 లక్షలతో పైపులైన్ల వ్యవస్థను మెరుగుపరచి.. ఈ ప్రాంత ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినట్లు మల్లాది విష్ణు తెలిపారు. సుమారు 300 కుటుంబాలు నివాసం ఉండే విశాలాంధ్ర కాలనీలో శుభకార్యాలు జరుపుకునేందుకు రూ.21.40 లక్షలతో ఓపెన్ డయాస్ ను నిర్మించి.. ప్రహరీతో పరిరక్షించుకున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సమస్యలతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారని.. ఈ ప్రభుత్వంలో రూ. 5 కోట్లతో ఉడాకాలనీలో సబ్ స్టేషన్ ను ప్రారంభించుకోవడంతో.. సుమారు 7,500 కుటుంబాలకు కోతలు లేని నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా అందుతోందన్నారు. అలాగే సుందరయ్యనగర్ పార్కులో రూ. 80 లక్షలతో ఓపెన్ జిమ్, విశాలమైన వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, చిన్నారులకు ఆట పరికరాలు ఏర్పాటు చేసుకోగా.. రూ. 14 లక్షలతో తెలుగుతల్లి పార్కును సర్వాంగసుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. EWS కాలనీ 5వ లైన్లోని పార్కును రూ. 75 లక్షలతో అభివృద్ధి పరుచుకున్నట్లు చెప్పారు. అధికారంలో ఉండగా ఈ పనులన్నీ ఎందుకు చేపట్టలేకపోయారో గత పాలకులు సమాధానం చెప్పాలన్నారు. పైగా ఓటమి భయంతో అలవికాని హామీలను బాబు ఎడాపెడా గుప్పిస్తున్నారని, అయినా ప్రజలు వాటిని నమ్మడం లేదని మల్లాది విష్ణు అన్నారు. పేదల మేలు, రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటిస్తే.. చంద్రబాబు మేనిఫెస్టో అధికారమే లక్ష్యంగా అద్దంపడుతోందని విమర్శించారు. ఈ ఎన్నికలలో కూటమికి ఓటమి తప్పదని హెచ్చరించారు.
చంద్రబాబుకు పింఛన్ దారుల ఊసురు తగులుతుంది
ఇంటి వద్దే పింఛన్ సొమ్ము అందకుండా అడ్డుకున్న చంద్రబాబుకు పింఛన్ దారుల ఊసురు తగులుతుందని మల్లాది విష్ణు అన్నారు. గత ఐదేళ్లుగా ప్రతీనెలా మొదటి తేదీ తెల్లవారుజామున పింఛన్ ను ఇంటి వద్దనే క్రమంతప్పకుండా అందిస్తుండటంతో అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వును చూసేవాళ్లమని పేర్కొన్నారు. అది చూసి జీర్ణించుకోలేని చంద్రబాబు అండ్ కో కోర్టులు, ఎలక్షన్ కమిషన్‌కు పిటీషన్లు పెట్టి వాలంటీర్లను దూరం చేశారని మండిపడ్డారు. దీంతో ఎర్రటి ఎండలో ముదిమి వయస్సులో వృద్ధులు పింఛన్ కోసం రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చిందని.. ఇందుకు చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ లే ప్రధాన కారకులని ఆరోపించారు. మీ స్వార్థ రాజకీయాల కారణంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు అల్లాడిపోతున్నారని.. అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ కష్టాలు తొలగిపోతాయని.. మరలా ఇళ్ల వద్దే పింఛన్ అందిస్తామని తెలియజేశారు. ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి.. వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ లను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. కార్యక్రమంలో నాయకులు పసుపులేటి యేసు, మోదుగుల గణేష్, సీహెచ్ రవి, టెక్యం కృష్ణ, నాని, మేడా రమేష్, నాగిరెడ్డి, మాన్యం జగదీష్, యక్కల మారుతి, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News