Breaking News

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జనరంజకంగా పాలన అందిస్తున్న జగనన్న: దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఐదేళ్ల టీడీపీ పాలనలో ఐదో డివిజన్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని వైసీపీ తూర్పు ఇన్ చార్జి దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కొండ చిట్టచివరి అంచువరకు మంచినీరు అందించి ప్రజలకు తాగునీటి ఇక్కట్లు లేకుండా చేశామని అవినాష్ అన్నారు. కొండ ప్రాంత ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా క్రషి చేస్తున్నట్లు అవినాష్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం 5వ డివిజన్ పరిధిలోని క్రీస్తురాజు పురం కొండ పైన ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దేవినేని అవినాష్. ఈ సందర్భంగా అవినాష్ మీడియాతో మాట్లాడుతూ… గతంలో దేవినేని నెహ్రూ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అభివ్రద్ధి మినహా డివిజన్ లో గత పాలకులు ఎటువంటి పనులు చేపట్టలేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొండ చిట్టచివరి ప్రాంతం వరకు తాగునీటి కుళాయిలను ఏర్పాటుచేసి తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకున్నారు. అనేక ప్రాంతాల్లో మెట్లను కూడా నిర్మించినట్లు తెలిపారు.వైస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ లు,కమ్యూనిటీ హాల్స్ అబివృధ్ది పనులు చేసాం అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన అందిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రజలంతా ఆశీర్వదిస్తున్నారని రానున్న ఎన్నికల్లో మళ్లీ తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ అంబెడ్కర్ డివిజన్ అధ్యక్షులు ప్రసాద్ మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *