-రెండవ రోజు ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఎన్నికల విధులు కేటాయించబడిన, అత్యవసర సర్వీసుల శాఖల ఉద్యోగులు: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
సత్యవేడు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధులలో ఉండి పోస్టల్ బ్యాలెట్ వినియోగం కొరకు ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు, అత్యవసర సేవల వారు నేటి దినం మే 6న రెండో రోజు రిటర్నింగ్ అధికారి పరిధిలోని సత్యవేడు ఎంపిడిఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల లో ప్రశాంతంగా తమ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించు కుంటున్నారని, ఫెసిలిటేషన్ సెంటర్ నందు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామని, అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు పార్లమెంట్ ఈవీఎం కమిషనింగ్ ఉదయం నుండి ప్రారంభమైందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
సోమవారం ఉదయం 169- సత్యవేడు(ఎస్ సి) అసెంబ్లీ నియోజక వర్గం నందు పోస్టల్ బ్యాలెట్ వినియోగం కొరకు సత్యవేడు ఎంపిడిఓ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పోస్టల్ ఓటింగ్ సెంటర్/ ఫెసిలిటేషన్ సెంటర్ ను, అక్కడ పోస్టల్ బ్యాలెట్ వినియోగం కొరకు వచ్చే వారికి ఏర్పాటు చేసిన వసతులను కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు 23-తిరుపతి పార్లమెంట్ కు సంబంధించిన ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ వినియోగం కొరకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అప్రమత్తంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రిటర్నింగ్ అధికారి 169- సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సూచించారు.
రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కు వివరిస్తూ త్రాగునీరు, చైర్స్, షేడ్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు, కనీస సదుపాయాలు కల్పించడం జరిగిందని, తగినంత బందోబస్తు ఏర్పాటు ఉందని తెలిపారు. అలాగే పార్లమెంట్ నియోజకవర్గ ఈవిఎం ల కమిషనింగ్ ఉదయం నుండి రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో ప్రారంభం అయిందని 36 సెక్టర్లుగా 36 టేబుల్ లతో 10 రౌండ్లలో జరిగేలా ఏర్పాటుతో 3 బెల్ ఇంజనీర్లు, సుమారు 300 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారని సకాలంలో పూర్తి చేస్తామని వివరించారు. బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ యూనిట్ నందు ఫిక్స్ చేయడం, కమిషనింగ్ ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కొనసాగుతోందని వివరించారు.
ఈ కార్యక్రమంలో నియోజక వర్గ తాసిల్దార్ రామాంజనే యులు, అలీఖాన్, ఎంపిడిఓ, సర్వే మరియు స్ట్రాంగ్ రూం సిబ్బంది, ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News