Breaking News

కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు నేపధ్యంలో కీలకమైన దశకు చేరుకున్నట్లు, అందుకు అనుగుణంగా సమన్వయం సాధించడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత పేర్కొన్నారు గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెలగపూడి నుంచీ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మాధవీలత, ఎస్పి పి జగదీష్, డి ఆర్వో జీ. నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏడు అసెంబ్లి నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బంది విధుల కేటాయింపు, పొలింగ్ కేంద్రాల సంసిద్దత, ఓటర్ల జాబితా, ఓటర్ స్లిప్స్ పంపిణీ, ఈ వి ఎమ్ యూనిట్స్ నిర్వహణా, పోల్ డే రోజున పర్యవేక్షణ , ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పై పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వడం జరిగిందన్నారు. నియోజక వర్గాల పరిధిలో పర్యటించి పొలింగ్ ముందు రోజున, పొలింగ్ రోజున చేపట్టనున్న ఏర్పాట్ల పై రిటర్నింగ్ అధికారులకు దిశా నిర్దేశనం చేయటం జరిగిందని తెలిపారు. మే 11 న పొలింగ్ సిబ్బంది 3వ ర్యాండమైజేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. 375 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పొలింగ్ రోజును దృష్టిలో పెట్టుకొని 72 గంటల ముందు నిర్వహించాల్సిన ఏర్పాట్ల విషయంలో పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వడం జరిగిందనీ తెలియ చేశారు.

ఎస్పీ పి జగదీష్ మాట్లాడుతూ, పోలీసు బందోబస్తు, భధ్రత ఏర్పాట్ల పై ఎన్నికల పరిశీలకులతో సూక్ష్మ స్థాయి ప్రణాళికా పై చర్చించడం , అందుకు అనుగుణంగా కార్యచరణ సిద్దం చేశామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *