విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అధారిటీ) కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కె.వి రామక్రిష్ణయ్య స్థానిక వాసవ్య మహిళా మండలిలోని శక్తి సదన్ గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇన్ మేట్స్ తో ఆయన ముచ్చటించారు, వారు ఏ పరిస్థితులలో ఇక్కడకు వచ్చారో అడిగి తెలుసుకున్నారు. చట్టాలపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అంతేకాకుండా వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. ఎవరికైనా న్యాయ సలహాలు అవసరమైతే ఎప్పుడైనా మీరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అధారిటిని సంప్రదించవచ్చని ఆయన అన్నారు. వాసవ్య లో ఇస్తున్న వృత్తి విద్యా శిక్షణ తరగతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పి.దీక్ష, ఉపాధ్యక్ష్యులు కె.విజయ, శక్తి సదన్ సూపరిండెంన్ట్ కె.రాణి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News