Breaking News

పోలింగ్ విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13 జరగనున్న పోలింగ్ విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సెక్టార్ అధికారులు, రూట్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ టీం సభ్యులతో పోలింగ్ విధుల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ఈ నెల 13 న జరిగే సార్వత్రిక ఎన్నికల విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికలు సజావుగా జరగడంలో సెక్టార్ అధికారులది కీలక పాత్ర అని, సెక్టార్ అధికారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, కేటాయించబడిన పిఓలు, ఇతర పోలింగ్ సిబ్బందితో నిరంతరం సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. ఇప్పటికే సెక్టార్, రూట్ అధికారులకు వైర్ లెస్ సెట్ లు అందించామని, ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం సెట్ ద్వారా తెలియచేస్తామన్నారు. క్షేత్ర స్థాయిలో ఏ సమస్య ఎదురైనా తక్షణం సెట్ ద్వారా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకురావాలన్నారు. బిఎల్ఓల ద్వారా ఓటర్ల స్లిప్ లు పంపిణీ జరిగిందని, బిఎల్ఓలతో సమీక్షించి ఎక్కడైనా అందని యెడల వెంటనే పంపిణీకి చర్యలు తీసుకోవాలని తెలిపారు. సెక్టార్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు మౌలిక వసతులని పరిశీలించాలని, ఏ సమస్య ఉన్నా వెంటనే సంబందిత ఏఈకి తెలియచేయాలన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 187 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ జరుగుతుందని, అందుకు తగిన సిసి కెమెరాలు ఏర్పాట్లు సంబందిత ఏఈలు భాద్యత తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల విధుల పర్యవేక్షణ, క్షేత్ర స్థాయిలో అధికారుల నుండి అందే ఫిర్యాదులు, సూచనల పర్యవేక్షణకు జిఎంసి ప్రదాన కార్యాలయంలో రిపోర్టింగ్ టీం ని ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ కి అవసరమైన మెటీరియల్ ను ఆదివారం ఉదయం నుండే అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని, సెక్టార్ అధికారులు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలోనే పిఓలు, ఏపిఓలతో సమన్వయం చేసుకోవాలన్నారు. పోలింగ్ సమయంలో ఏ సమస్య ఎదురైనా పరిష్కారానికి క్విక్ రియాక్షన్ టీం ని జిఎంసి ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాద్, ఏఆర్ఓలు భీమరాజు, ప్రదీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్లు టి.వెంకట కృష్ణయ్య, వెంకట లక్ష్మీ, ఎంహెచ్ఓ మధుసూదన్, ఈఈ సుందర్రామిరెడ్డి, సెక్టోరియల్ అధికారి బి.శ్రీధర్ బాబు, డిఈఈలు శ్రీధర్, రాము, మేనేజర్ ఎస్.ఎన్.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *