గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈవిఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటు పనులను వేగంగా చేపట్టాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం సార్వత్రిక ఎన్నికల అనంతరం గుంటూరు తూర్పు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఈవియంలు భద్రపరచే స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్స్, రిసెప్షన్ సెంటర్లకు సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజిలో ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ఈ నెల 13 న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆచార్య నాగార్జున యూనివర్శిటిలో సార్వత్రిక ఎన్నికల అనంతరం గుంటూరు తూర్పు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఈవియంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్స్, రిసెప్షన్ సెంటర్లకు సంబంధించి ఏర్పాట్లను ప్రణాళికాబద్దంగా చేపట్టాలన్నారు. అలాగే స్టాట్యూటరీ రూమ్, అబ్జర్వర్ స్క్రూట్ని హాల్ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఎన్నికల నిబందనల మేరకు ఏర్పాట్లు ఉండాలని, స్ట్రాంగ్ రూమ్ కి డబుల్ లాక్ ఉండాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజంట్లు, అధికారులు, సిబ్బంది రావడానికి వేరు వేరుగా మార్గాలు ఉండేలా బ్యారీకేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ సిసి కెమెరా డిస్ ప్లే పాయింట్ లు ఏర్పాటు చేయాలని, వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పర్యటనలో డిప్యూటీ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఈఈ సుందర్రామి రెడ్డి, ఎంహెచ్ఓ మధుసూదన్, డిఈఈ రమేష్ బాబు, ఏసిపి మురళి, ఎస్ఎస్ రాంబాబు, ఏఈ సునీల్ కుమార్, ఎలక్షన్ డిప్యూటీ తహసిల్దార్ మల్లేశ్వరరావు, సర్వేయర్ లోకేష్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News