Breaking News

అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
పోలింగ్ రోజున పోలింగ్ ప్రక్రియను జిల్లా ప్రధాన కార్య స్థానం నుండి పరిశీలించుటకు, పోలింగ్ కేంద్రంలో సజావుగా ఓటింగ్ జరుగుతోందా అని పరిశీలించడం జరుగుతుందని, వాటి పర్యవేక్షణ కొరకు, సత్వర చర్యలు కొరకు మీడియా మానిటరింగ్, వెబ్ కాస్టింగ్, కమ్యూనికేషన్ కంట్రోల్ రూం ల ఏర్పాట్ల విధి విధానాలపై కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

శుక్రవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పోలింగ్ రోజున పోలింగ్ ప్రక్రియను జిల్లా ప్రధాన కార్య స్థానం నుండి పరిశీలించుటకు, పోలింగ్ కేంద్రంలో సజావుగా ఓటింగ్ జరుగుతోందా అని పరిశీలించడం జరుగుతుందని, వాటి పర్యవేక్షణ కొరకు, సత్వర చర్యలు కొరకు మీడియా మానిటరింగ్, వెబ్ కాస్టింగ్, కమ్యూనికేషన్ కంట్రోల్ రూం ల ఏర్పాట్ల విధి విధానాలపై దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వెబ్ కాస్టింగ్, పిడిఎంఎస్, మీడియా మానిటరింగ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పక్కాగా పర్యవేక్షించాలని తెలిపారు. పోలింగ్ రోజున ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా లలో ప్రసారమయ్యే ఎన్నికల ప్రతికూల అంశాలను మీడియా మానిటరింగ్ కంట్రోల్ రూమ్ నందు పరిశీలించి వాటిని ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ కంట్రోల్ రూమ్ వారితో సమన్వయం చేసుకొని సత్వరమే ప్రతికూల వార్తలపై స్పందించి చర్యలు చేపట్టాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వెబ్ కాస్టింగ్ ఏర్పాటుతో నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియను జిల్లా కంట్రోల్ రూమ్ నుండి పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు, సెక్టార్ అధికారులకు, ప్రిసైడింగ్ అధికారులకు, బిఎల్ఓ ల వరకు సమాచార సమన్వయం ఏర్పాటుతో ఫిర్యాదు అందిన వెంటనే లేదా ఉల్లంఘనలు గుర్తించిన వెంటనే స్పందించి పరిష్కారం జరిగేలా చర్యల కొరకు జిల్లా అధికారులను నియోజకవర్గాల వారీగా పర్యవేక్షించేందుకు నియామకం చేయడం జరిగిందని తెలిపారు. అలాగే పోల్ డే మానిటరింగ్ సిస్టం అప్లికేషన్ ను ప్రిసైడింగ్ అధికారులు తదితర ఎన్నికల సంబంధిత అధికారులు తమ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకోవడం, మాక్ పోల్ తదితర సమాచారం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని సూచించారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, సెక్టర్ అధికారులు, సీ – విజిల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా లో స్వీప్ నోడల్ అధికారి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. తగినంత పోలీస్ బందోబస్తు ఉంటుందని తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు పర్యవేక్షణ నోడల్ అధికారి శ్యామ్ మోహన్ వెబ్ కాస్టింగ్ ఏజెన్సీ తో సమన్వయం చేసుకుని పూర్తి స్థాయిలో ఏర్పాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎస్డిసి మురళి, డిఎల్డిఓ సుశీల దేవి, పిడి డిఆర్డిఎ ప్రభావతి, సిపిఓ ప్రేమ్ చంద్ర రెడ్డి, బాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యువతలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహనకు 5కే రెడ్ రన్

-హెచ్‌ఐవీ/ఎస్టీఐ రహిత తరం కోసం యువత భాగస్వామ్యం కావాలి -కమిషనర్ రాహుల్ మీనా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *