విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలియటమే కాదు…గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకుతింటున్న జగన్ అహంకారం ఎలా అణచాలో కూడా తెలుసునని…ఎన్టీయే కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ కృషే కారణమని టిడిపి విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధి కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడలో గురువారం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రచార ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ పశువుల హాస్పిటల్ దగ్గర ప్రారంభమై విశాలాంధ్ర రోడ్డు, ఏలూరు రోడ్డు, అప్సరా థియేటర్, ఉడా ఆఫీస్, లెనిన్ సెంటర్, ఐలాపురం హోటల్ సెంటర్, న్యూ ఇండియా హోటల్ సెంటర్, స్టేషన్ రోడ్, లో బ్రిడ్జ్ కాళేశ్వరరావు మార్కెట్ మీదుగా పంజా సెంటర్ వరకు సాగింది.
ఈ ర్యాలీ సందర్భంగా విజయవాడ రహదారులు జనసంద్రంగా మారాయి. వీధులన్నీ జనంతో పోటెత్తాయి. కాషాయం.. పసుపు.. తెలుపు… జెెండాలు ఒక్కటయ్యాయి. జెండాలు వేరైనా నినాదం ఒకటైంది. జై చంద్రబాబు .. జైజై పవన్ కల్యాణ్… నినాదాలు నగర వీధుల్లో మార్మోగాయి. తమనేతలకు జనసేన , టిడిపి, బిజెపి నేతలు ఘనస్వాగతం పలికారు. పశువుల హాస్పటల్ దగ్గర ప్రారంభమైన ఈ ర్యాలీ ఏలూరు రోడ్డు చేరేందుకు గంటన్నర సమయం పట్టింది. పార్టీ కార్యాకర్తలతో పాటు మహిళలు, చిన్నారులు కూడా పాల్గొన్నారు. రోడ్డుకి ఇరువైపుల మహిళలు నిలబడి చేతులుపుతూ మద్దతు తెలియజేశారు. ఐదేళ్లగా భయం చాటున దాగిన దైర్యం కట్టలు తెంచుకున్నట్లు రెట్టింపు ఉత్సాహంతో వయో బేధం లేకుండా అందరూ రోడ్లపై పార్టీ జెండాలు పట్టుకుని వచ్చారు.
ఇక పంజా సెంటర్ లో జరిగిన బహిరంగ సభకి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి స్వాగతోపన్యాసం చేయగా…అనంతరం కేశినేని శివనాథ్ మాట్లాడారు. విజయవాడలో ఎన్డీయే కార్యకర్తలకు ప్రధాన మంత్రి మోదీ ర్యాలీ, పవన్ ర్యాలీ తో డబుల్ జోష్ వచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్ వల్లే కూటమి కలయిక ఇంత అద్బుతంగా జరిగిందన్నారు. ఎన్డీయేలోకి తెలుగుదేశంపార్టీ ఆహ్వానించటానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని ఉద్ఘాటించారు. పవన్ కళ్యాణ్ కు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి అంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. కొన్ని విషయాల్లో త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలు నెగ్గారని కొనియాడారు. గాడి తప్పిన ఈ రాష్ట్రం చంద్రబాబు, మోదీలతోపాటు మీ నాయకత్వంలో రాష్ట్రం గాడిలోకి రావాలని అభివృద్ది పథంలో పయనించాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజా జీవితంలో ఇబ్బందిన పెట్టిన నాయకులకి ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ది చెప్పాలని..ఎన్డీయే అభ్యర్ధులకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర నిర్మాణం కోసం రక్త సంబంధాన్ని పక్కన పెట్టి శ్రమిస్తున్న నాయకుడు కేశినేని శివనాథ్ అన్నారు. కూటమి ఎందుకు ఏర్పడింది…ఎందుకు కోసం పోరాడుతుందనే విషయాలు గ్రహించి రాష్ట్ర ప్రయోజనాల కోసం కుటుంబ విభేదాలను దాటి తెలుగుదేశంపార్టీ తరుఫున విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి గా పోటీచేస్తున్నారని కొనియాడారు.
Prajavartha Online Telugu News