Breaking News

టిడిపిలోకి భారీ చేరికలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొగల్రాజుపురం లోని టిడిపి పోలిట్ బ్యూరోసభ్యులు సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద శుక్రవారం వైయస్సార్సీపి పార్టీకి చెందిన నాయకులు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా: టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు హాజరయ్యి వారిని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగినది. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ వై వైఎస్ఆర్సిపి పార్టీ నుండి బొందిలి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ శైలజ , ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ అప్రోచ్, రాష్ట్ర ఎస్సీ సెల్ వైఎస్ఆర్సిపి నాయకులు పేకేటి రాజశేఖర్, విజయవాడ సోషల్ మీడియా కన్వీనర్ వజీర్, రాష్ట్ర బీసీ సెల్ వైఎస్ఆర్సిపి కార్యదర్శి రోటి బ్రహ్మేంద్ర తదితరులు పార్టీలో జాయిన్ అవ్వడం సెంట్రల్ నియోజకవర్గానికి బలం అని తెలిపారు ఈరోజు యువతకు, ఎస్సి ,బీసీ, మైనారిటీ లాకి విద్య ఉపాధి అవకాశాలు కల్పించిన టువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ని తెలుగుదేశం పార్టీని బలపరచడం అందరి కర్తవ్యం తెలిపారు. ఈరోజు ప్రజలు మేధావులు విద్యార్థులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారని ఇందులో భాగంగా బొందిలి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ శైలజ , ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ అప్రోచ్, రాష్ట్ర ఎస్సీ సెల్ వైఎస్ఆర్సిపి నాయకులు పేకేటి రాజశేఖర్, విజయవాడ సోషల్ మీడియా కన్వీనర్ వజీర్, రాష్ట్ర బీసీ సెల్ వైఎస్ఆర్సిపి కార్యదర్శి రోకెటి బ్రహ్మేంద్ర ల ఆధ్వర్యంలో ఈరోజు సుమారు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన 200 మంది యువకులు, మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారని, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి దేశ విదేశాలలో అనేక అనేక ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి నారా చంద్రబాబునాయుడు ని యువత అంతా ముక్తకంఠంతో బాబుని మళ్లీ రప్పిద్దాం అంటున్నారని తెలిపారు
సాంకేతిక నిపుణులు అయిన విద్యార్థులు ఉద్యోగులు తాము ఈ స్థాయికి చేరటానికి తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని చెబుతారని అందుకని ఈరోజు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు తర్వాత దేశ విదేశాలలో ఎప్పుడూ రాని విధముగా రోడ్డుమీదకు వస్తున్నారని ఇకముందు అయినా ప్రభుత్వం సిగ్గుపడాలని తెలిపారు.

ఈరోజు ముందుచూపుతో తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయినా యువతకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు నారా చంద్రబాబునాయుడు త్వరలో కడిగిన ముత్యమల్లె బయటకు వస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం కల్పించిన పార్టీ, వారిని నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. రాబోయేది తెలుగుదేశం పార్టీ అని ప్రజలు తెలుగుదేశం పార్టీ పక్షానే ఉన్నారని ఈ చేరికలే నిదర్శనం అని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ కానుందని అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఘంటా కృష్ణమోహన్, పైడి శ్రీను,జాన్ వలి, పిరియ సోమేశ్వర రావు అమర్నాథ్ బలుసుపటి మహేష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *