Breaking News

ఎన్నికల ఏర్పాట్లను అదనపు కమీషనర్ అధికారులతో కలసి పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 13వ తారీఖున జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 292 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె.రాజ్యలక్ష్మీ తెలిపారు. శనివారం లాడ్జ్ సెంటర్ లోని ఏ.యల్ బి.ఈ.డి కళాశాల నందు డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి ఏర్పాట్లను అదనపు కమీషనర్ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ఈ నెల 13 న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఓటర్లు పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ఏ సమస్య లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేశామని, వికలాంగుల కోసం ర్యాంప్ లు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. బిఎల్ఓల ద్వారా ఓటర్ల స్లిప్ లు పంపిణీ చేయడం జరిగిందని, పోలింగ్ రోజు ఓటరు గుర్తింపు కార్డ్ (ఎపిక్ కార్డ్) తీసురావాలని, ఓటర్ గుర్తింపు కార్డ్ లేకుంటే ఎన్నికల కమిషన్ మార్గదర్శాకాల ప్రకారం పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ గుర్తింపు కార్డ్, ఫొటో ఉన్న బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, పాన్ కార్డ్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్.పి.ఆర్.) పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్.జి.ఐ.) జారీ చేసిన స్మార్ట్ కార్డ్, ఉపాధి హామీ గుర్తింపు కార్డ్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్, ఫొటో ఉన్న పెన్షన్ కార్డ్, ప్రజా ప్రతినిధులకు జారీ చేసిన అధికార గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్ వంటి 11 గుర్తింపు కార్డ్ ల్లో ఏదో ఒకటి పోలింగ్ అధికారులకు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో త్రాగునీరు, టాయ్ లెట్స్, లైటింగ్, టెంట్ లు, కుర్చీలు వంటి మౌలిక వసతులను సంబందిత ప్రాంత ఏఈలు పూర్తి చేయడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలోపు పార్టీల కార్యాలయాలు ఉండకూడదన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలోని మొత్తం 292 పోలింగ్ కేంద్రాల్లో 218 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయుటకు చర్యలు తీసుకున్నామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 2,78,158 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 1,35,426, మహిళలు 1,42,688, ఇతరులు 44 మంది ఉన్నారని తెలిపారు. ఎన్నికల విధుల పర్యవేక్షణ, క్షేత్ర స్థాయిలో అధికారుల నుండి అందే ఫిర్యాదులు, సూచనల పర్యవేక్షణకు లాడ్జి సెంటర్ లోని ఏఎల్ బిఈడి కాలేజిలో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *