Breaking News

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్ల పై అధికారులతో సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో ని పార్లమెంటు, అసెంబ్లి నియోజక వర్గాలకు చెందిన ఈవిఎమ్ యూనిట్స్ భద్రపరచిన స్ట్రాంగ్ రూం , కౌంటింగ్ హాల్, పోస్టల్ బ్యాలెట్ లు, స్టాట్యూటరీ మెటీరియల్ భద్రపరిచే క్రమంలో ప్రక్క ప్రక్కనే ఏర్పాటు చేసినట్లు రాజమండ్రి రూరల్ అసెంబ్లి నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు.

గురువారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్ల పై రాజకీయ పార్టీల, అభ్యర్ధుల రెవిన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ, మే 13 పోలింగు ప్రక్రియ ముగిసిన అనంతరం ఈ వి ఎమ్ యూనిట్స్, స్టాట్యూటరీ మెటీరియల్ , పోస్టల్ బ్యాలెట్ పత్రాలు స్ట్రాంగ్ రూమ్ లకి భద్రపరచి అభ్యర్ధుల, వారీ ప్రతినిథుల సమక్షంలో సీల్ వెయ్యడం జరిగిందన్నారు. అదే విధంగా ఆ మూడు రూములకి కూడా డోర్, కిటికీ లను చెక్కలను కొట్టి మూసి ఉంచామన్నారు. ఓట్లు లెక్కించే జూన్ 4 వ తేదీ ఉదయం 5 గంటలకి అభ్యర్ధులు లేదా వారి ఏజెంట్ సమక్షంలో తెరవనున్నట్లు తెలిపారు. ఆలోగా తప్పనిసరిగా హజరు కావాలని పరిశీలకులు వారి సమక్షంలో ఉదయం 5.30 గంటలకు కౌంటింగ్ సిబ్బంది టేబుల్ ఎలాట్ మెంట్ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. స్ట్రాంగ్ ల వద్ద రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటినీ కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షణా చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ అభ్యర్ధులు, ఏజెంట్స్ నిరంతరం పరిశీలించడం జరుగుతుందనీ అన్నారు. శుక్రవారం నుంచి అభ్యర్ధులు, ఏజెంట్స్ నేరుగా స్ట్రాంగ్ రూమ్ లను తనిఖీ చేసే అవకాశం ఉందని, ఆమేరకు పోలీసు, గేజిటెడ్ అధికారి ఎస్కార్ట్ తో పంపనున్నట్లు
తెలియ చేశారు. మూడు షిఫ్ట్ లలో తహసీల్దార్లు ను నియమించినట్లు తెలిపారు. నియోజక వర్గం లో 3,033 పోస్టల్ బ్యాలెట్ పోలైనట్లు తెలిపారు.

ఈ సమావేశంలో సహాయ రిటర్నింగ్ అధికారులు, అభ్యర్ధులు, ఏజెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *