Breaking News

ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు రాష్ట్రస్థాయి కౌన్సిలింగ్

-ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో 152 మంది విద్యార్థులకు సీట్లు కేటాయింపు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు రాష్ట్రస్థాయి కౌన్సిలింగ్ గురువారం గుంటూరులోని పరీక్షా భవన్‌లో నిర్వహించామని APREI సొసైటీ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధికి చెందిన విద్యార్థులు 152 మందిని ఎంపిక చేశారు. బి.ఏ (హెచ్ఈపీ) 40 మంది, బికాం (జనరల్) 40 మంది, బీఎస్సీ (ఎంపీసీ) 36 మంది, బీఎస్సీ (ఎంఎస్సీఎస్) 36 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ & కన్వీనర్(APRJC – CET) హెచ్.ఎండీ.ఉబెదుల్లా, APRDC ప్రిన్సిపాల్ YNS చౌదరి, లైజన్ ఆఫీసర్ డా. పి.వి.మల్లేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *