తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోల్డ్ ఈవిఎం లు భద్రపరచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లను, కౌంటింగ్ ఏర్పాట్లను తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు పలు సూచనలు చేశారు.
శుక్రవారం ఉదయం సదరు స్ట్రాంగ్ రూంల భద్రత పరిశీలించి, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన 6 నియోజక వర్గాల కౌంటింగ్ కేంద్రాల మరియు తిరుపతి పార్లమెంటరీ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లను, మెష్, బ్యారికేడింగ్ సీటింగ్ తదితర అంశాలపై డిఆర్ఓ తో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఏర్పాట్లు చాలా పక్కాగా ఉండాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. పవర్ సప్లై నిరంతరంగా ఉండేలా జనరేటర్ తగు సామర్థ్యం ఉండేలా ఏర్పాటు ఉండాలని పలు సూచనలు చేశారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూం నందు ఈవిఎం లను పరిశీలించారు. సందర్శకుల రిజిష్టర్ నందు సంతకాలు చేశారు.
వీరి వెంట జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, అదనపు ఎస్పీ ఎ.ఆర్ శ్రీనివాస రావు, శ్రీకాళహస్తి రిటర్నింగ్ అధికారి రవి శంకర్ రెడ్డి, సత్యవేడు రిటర్నింగ్ అధికారి నరసింహులు, జిల్లా సర్వే అధికారి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News