Breaking News

ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి…

-ఏపీ, తెలంగాణ సీఎంల చర్చలు పారదర్శంగా ఉండాలి
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒకే గొంతు వినిపించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు ఢల్లీిలో పర్యటించి ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరటం అభినందనీయం అన్నారు. రాష్ట్ర అర్థిక పరిస్థితి పూర్తి సంక్షోభంలో ఉన్న కారణంగా సీఎం కేర్రదాన్ని కోరటం చాలా అవసరం అన్నారు. సీపీఐ ముందు నుంచి చెపుతున్నట్లే ఆర్థికంగా రాష్ట్రం గట్టేక్కాలంటే ప్రత్యేక హోదా కాదు దాన్ని కంటే మించింది ఇవ్వాలని సీఎం వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు. పదేళ్ల మోదీ కాలంలో ఆంధ్రప్రదేశ్‌కి అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రాన్ని ఏదీ అడగలేక అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలుజేశారని విమర్శించారు. చివరికి ఉద్యోగులకు జీతాలు, పింఛన్‌లు ఇవ్వటానికి కూడా అప్పులు చేశారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ కోలుకుని అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడుగుతున్నారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంటులో సాక్షాత్తు ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చెప్పటం జరిగిందన్నారు. తరువాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ, నిధులు ఇవ్వలేదన్నారు. దీంతో రాష్ట్రం అన్ని రంగాల్లో దివాళా తీసిందన్నారు. సీఎం చంద్రబాబు చెపుతున్నట్లు ఏపీ అభివృద్ధి దిశగా సాగాలంటే హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని, విశాఖ రైల్వే జోన్‌, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలని వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అరకొర నిధులు కాకుండా బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇవ్వాలన్నారు.

పారదర్శంగా సీఎంల చర్చలు సాగాలి
ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా ఇప్పటికీ పరిష్కారం గాని సమస్యలపై ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లో జరుపుతున్న చర్చలు ప్రజలందరికీ తెలిసేలా పారదర్శకంగా సాగాలన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు అనుమానాలు లేకుండా కలిసిమెలిసి ఉండటానికి ఈ చర్చలు దోహదం చేయాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ చర్చల అంశాలు తెలిస్తే వాటిపై వారు ఇచ్చే సూచనలు, సలహాలు ఇరురాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడతాయని రామకృష్ణ స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *