Breaking News

వినియోగదారునికి ఉచిత ఇసుకను అందించే క్రమంలో మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు

-జిల్లా, డివిజనల్ స్థాయిలో కమిటీల ఏర్పాటు
-ఎస్కలేషన్ (త్రవ్వకాలు) రవాణా, పరిపాలనా పరమైన చార్జీలు వసూలు
-ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో ఇసుక సరఫరా
-స్టాక్ పాయింట్, డిసిల్టేషన్ పాయింట్స్ వద్ద అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ
-స్టాక్ పాయింట్స్ వద్ద సి సి కెమెరాల నిఘా వ్యవస్థ
-గరిష్టంగా ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే అనుమతి
-డి ఎల్ ఎస్ ఎ ఛైర్మన్/ కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆదేశాల మేరకు జిల్లాలో ఉచిత ఇసుక పంపిణీ పాలసీ (ఫ్రీ శాండ్ పాలసీ) విధానంలో జవాబుదారీతనం కలిగి మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చెయ్యాలని, ఆమేరకు వినియోగదారులకి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా విధి విధానాలు అమలు చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా పి. ప్రశాంతి స్పష్టం చేశారు.

శనివారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్ల తో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, ఉచిత ఇసుక పాలసీలపై విజయవాడ నుంచి దృశ్య శ్రవణ సమావేశం నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం కలెక్టర్ అధ్యక్షతన తూర్పు గోదావరి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు.

తొలుత రాష్ట్ర ప్రథాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ, జూలై ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సమర్థవంతంగా పంపిణీ చేయడం ద్వారా 99.08 శాతం మందికి అందించడం అభినందనీయం అన్నారు. రాబోయే నెల నుంచి మరింత సమర్ధవంతంగా పంపిణీ కోసం ప్రతికూల అంశాలను దృష్టిలో పెట్టుకొని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇసుక పాలసీ విధి విధానాలు జిల్లా స్థాయి ప్రణాళికలపై దిశా నిర్దేశానం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఉచిత ఇసుక పాలసీ విధానంలో వినియోగదారుల నుంచి కేవలం ఇసుక త్రవ్వకం, రవాణా, పరిపాలన పరమైన ఖర్చులను మాత్రమే వసూలు చెయ్యడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రుసుము వసూలు చెయ్యడం జరగదన”, లాభాపేక్ష లేకుండా వినియోగదారులకి సరసమైన ధరకు ఇసుక సరఫరా మన లక్ష్యం అని తెలిపారు. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఉచిత ఇసుక పాలసీ విధి విధానాలు పై క్షేత్ర స్థాయిలో వినియోగదారులకి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని డివిజన్ స్థాయి రెవిన్యూ అధికారులకి సూచనలు చేశారు. స్టాక్ పాయింట్ వద్ద డిప్యూటీ తహసీల్దార్, ఆపై స్థాయి అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణ చెయ్యడం జరుగుతుందని, మూడు షిఫ్ట్ లలో విధులను నిర్వర్తించేలా విధులను కేటాయించాలన్నారు. ఉచిత ఇసుక పంపిణీ విధానం సమర్థవంతంగా అమలు చేసేలా జిల్లా స్థాయి ఇసుక కమిటీ ప్రధాన పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. 20 టన్నుల వరకూ వ్యక్తిగతంగా ఆధారాలు, వివరాలు తీసుకుని ఇసుక సరఫరా చేయాలని, ఆపై DLSC ద్వారా సమీక్ష నిర్వహించి అనుమతులు జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానం లో అమ్మకాలు జరిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని తెలిపారు జిల్లా, డివిజనల్ స్థాయిలో ఎన్ఫోర్స్ మెంట్ బృందాల ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాల్సి ఉందన్నారు.

ఆయా స్టాక్ పాయింట్స్, డిసిల్టేషన్ పాయింట్స్ వద్ద మండల రెవిన్యూ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో కూడి నిరంతర పర్యవేక్షణ చెయ్యాలని కలెక్టరు పి, ప్రశాంతి తెలిపారు. ఇసుక రవాణా కోసం వినియోగించే వాహనాలు స్టాక్ తీసుకుని వెళ్లగలిగే స్థాయి వివరాలు, జిపిఎస్ ట్రాకింగ్ పై దృష్టి పెట్టాలని కోరారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇసుక సక్రమంగా రవాణా అయ్యేలా, ధరల నియంత్రణ విషయంలో ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు పోలీస్, రెవిన్యూ, సెబ్ ల సంయుక్త ఆధ్వర్యంలో బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్తగా డిసిల్టెషన్ చేసేందుకు ఏజనస్సీ లు, బోట్స్ మ్యాన్ సొసైటి టెండర్ ప్రకటన ద్వారా ఎంపిక చెయ్యాల్సి ఉంటుందని, ఆమేరకు చర్యలు తీసుకోవాలని కమిటీలో నిర్ణయించడం జరిగింది.

అనుమతులు పొందేందుకు మరియు డీ-సిల్టేషన్ కార్యకలాపాలను చేపట్టడానికి జల వనరుల శాఖ కి అవసరమైన సహాయాన్ని అందించడం మరియు సంబంధిత జిల్లాల్లో మొత్తం డీ-సిల్టేషన్ కార్యకలాపాలు సజావుగా జరిగేలా పర్యవేక్షించా లన్నారు. డీ-సిల్టేషన్ కార్యకలాపాల మార్గదర్శకాల ప్రకారం, పర్యావరణ నిర్వహణ ప్రణాళికతో పాటు సరైన సాధ్యాసాధ్యాల నివేదిక అందజేయాలన్నారు. జలవనరుల శాఖ, నదులు, కాలువలు మరియు రిజర్వాయర్ల సంరక్షకుడు, తదుపరి అనుమతులు పొందేందుకు అవసరమైన కార్యకలాపాలను చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇసుక తవ్వకం, లోడింగ్ వంటి అన్ని కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు స్టాక్ యార్డ్ ఇన్చార్జులు బాధ్యత వహించాలి. అమ్మకాలు & పంపకాలు, ఇసుక విధానం మరియు వర్తించే అన్ని చట్టాలు & నియమాలు ప్రభుత్వం జారీ చేసిన నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు.

ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ శ్రీ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవిన్యూ అధికారి శ్రీ జి. నరసింహులు, ఆర్డీవో శ్రీ ఏ. చైత్ర వర్షిణి, జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి ఎమ్. సుబ్రహ్మణ్యం, ఎఏస్పీ సెబ్ పి. సోమ శేఖర్, పోలీస్ ఏ ఎస్పీ ఎమ్. రాజశేఖర్, ఈ ఈ ఇరిగేషన్ ఆర్. కాశీ విశ్వేశ్వర రావు, పిడి, డి.ఆర్.డి.ఎ పి డి – ఎన్ వివి ఎస్ మూర్తి, ఆర్డబ్ల్యూసీ ఎస్ ఈ డి. బాల శంకర రావు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి డి. రాంబాబు, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి వై. శ్రీనివాస్ , ఏ టీ వో సంపత్ కుమార్, పిసిబి అధికారి,(పొల్యూషన్ ) డిఎస్పీలు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *