-జిల్లాస్థాయి, మండల స్థా యిలోను ఏర్పాటు చేసాం.
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పని చేసే ప్రదేశంలో మహిళల పై లైంగిక వేధింపులను నిరోధించే దిశగా జిల్లా, మండల స్థాయి లోను కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేదింపుల చట్టం – 2013 (నివారణ, నిషేథము మరియు పరిహారం) పై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, స్ధానిక ఫిర్యాదుల కమిటీ నోడల్ అధికారులతో నిర్వహించిన శిక్షణ తరగతులకు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ అవాంఛనీయ చర్యలు లేదా లైంగిక లతో కూడిన ప్రవర్తన, ప్రతికూలమైన లేదా భయపెట్టే పని వాతావరణాన్ని సృష్టించడాన్ని ఈ చట్టం స్పష్టమైన నిర్వచనాన్ని అందిస్తుందన్నారు.
పది మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని చట్టం ఆదేశించిందన్నారు. లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు, సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి ఈ కమిటీ బాధ్యత వహిస్తుందన్నారు.
జిల్లా స్థాయి కమిటీలో జిల్లా కలెక్టర్… చైర్ పర్సన్ గా డీఎం, సివిల్ సప్లైస్ టి. రాధిక, .. ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా పి.డి.మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారి. కె . విజయ కుమారి, సభ్యులుగా గిరిజన సంక్షేమ అధికారి, కే. ఎన్. జ్యోతి డిఎల్డిఓ.. పి. వీణా దేవి, ఏకలవ్య చిల్డ్రన్ హోమ్ ప్రతినిధి పి. శేషారత్నం ను నియమించడం జరిగిందని తెలిపారు.
జిల్లా లో ఇప్పటివరకు 78 మహిళలపై లైంగిక వేధింపుల నిరోధించే కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
2013 మహిళా హక్కుల పరిర క్షణలో భాగంగా పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధిం పులు నిర్వహించడానికి ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, నర్సింగ్ హోమ్లు, పరిశ్రమలు, క్రీడా సంస్థలు, హాస్పిటల్స్, సహకార సంస్థలు, విద్యాసంస్థలు, కార్పొరేషన్లు, స్వయం ఉపాధిలు, బ్యాంకులు, మరే ఇతర పనిచేసే చోటనైనా పదిమంది కన్నా తక్కువగా ఉన్నాసరే మహిళల పట్ల అస భ్యకరంగా ప్రవర్తించిన వారందరి పట్ల ఈ చట్టం వర్తిస్తుందన్నారు.
మహిళలు స్వేచ్చగా భద్రతా కలిగి ఏదైనా వృత్తి, వ్యాపారం లేదా వ్యాపారాన్ని నిర్వహించ డానికి అనువైన వాతావరణం కలిగి ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. పనిచేసే ప్రదేశాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ కింద ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం స్థానిక ఫిర్యాదుల సెక్షన్ కింద లోకల్ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక అందచేయాలని పేర్కొన్నారు.
అంతర్గత ఫిర్యాదుల కమిటీ రాజ్యాంగం పరిమితులు లోబడి పని స్థలం యొక్క ప్రతి యజమాని వ్రాతపూర్వక ఉత్తర్వుల ద్వారా, “అంతర్గత ఫిర్యాదుల కమిటీ” అని పిలవబడే ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాలల పరిరక్షణ విభాగం, లీగల్ ఆఫీసర్ ఎస్. గౌరీ, మంజు భార్గవి, వైష్ణవి మహిళల పై లైంగిక వేధింపులను నిరోధించే చట్టం గురించి వివరించారు. కార్యాలయంలోని అడ్మి నిస్ట్రేటివ్ యూనిట్‌లలో సీనియర్ స్థాయి మహిళా ఉద్యోగి లేకుంటే, ప్రిసైడింగ్ అధికారిని, యజమాని లేదా ఇతర శాఖ లేదా సంస్థ యొక్క ఏదైనా ఇతర కార్యాల యం నుండి నామినేట్ చేసే అధికారం ఉందన్నారు. మహిళల భద్రత విషయానికి ప్రాధాన్యతనిస్తూ లేదా సామాజిక సేవలో అనుభవం ఉన్నవారు లేదా చట్టపరమైన పరిజ్ఞానం ఉన్న ఉద్యోగుల నుండి ఇద్దరు సభ్యుల కంటే తక్కువ కాకుండా కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.
ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్ష ణ చేసేందుకు మునిసిపల్ కమీషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు నోడల్ అధికారి గా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి (ఐ సి డి ఎస్) కే. విజయ కుమారి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News