రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజమహేంద్రవరం నందు చైర్మన్ మరియు జిల్లా జడ్జ్ ఇంచార్జ్ 1 వ అదనపు జిల్లా జడ్జ్ ఆర్. శివ కుమార్ జిల్లా రవాణా శాఖ అధికారులు మరియు ట్రాఫిక్ పోలీసు అధికారుల సమన్వయంతో రాజమహేంద్రవరం కి చెందిన న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి, “రోడ్డు ప్రమాదాల నివారణ” పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 1 వ అదనపు జిల్లా జడ్జ్ ఆర్. శివ కుమార్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. అతివేగం ప్రమాదకరమని, నిబంధనలు ఉల్లంఘించి ఎవరు వాహనాలు నడపరాదని హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం ప్రమాదకరమన్నారు.”
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రకాష్ బాబు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రెండు చక్రాల వాహనం నడిపే ప్రతీ ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పారు.. హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్షణ అని పేర్కొన్నారు.
ఈ సదస్సులో రాజమహేంద్రవరం కి చెందిన న్యాయమూర్తులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి.రామ్ నారాయణ్ , అస్సిస్టంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యన్. సబితా , రాజమహేంద్రవరం కి చెందిన కోర్టు సిబ్బంది మరియు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News