రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వాతావరణ మార్పు లు, సీజనల్ పరిస్థితుల నేపథ్యంలో గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక శానిటేషన్ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు మండల ప్రత్యేక అధికారులతో శానిటేషన్ నిర్వహణ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ అంశాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , వాతావరణ పరిస్థితుల మార్పుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం నివారించేందుకు శానిటేషన్ నిర్వహణ విషయంలో, శుద్ధమైన త్రాగునీటి సరఫరా కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. త్రాగినీటి సరఫరా చేసే ఓ హెచ్ ఆర్ ల నిర్వహణ విషయంలో క్లోరినేషన్ సంబంధిత ప్రాంతాల్లో శానిటేషన్ పై ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. డయేరియా డెంగు మలేరియా వంటి వంటి నిర్వహణకు సంబంధించి పార్టీ నిర్వహణ అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. సంబంధించి క్షేత్రస్థాయిలోని అధికారులు, సిబ్బంది చేపట్టిన చర్యలు ధ్రువీకరణ చేయాల్సి ఉందన్నారు. ఆయా ధ్రువీకరణ వివరాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ విషయంలో అధికారుల సిబ్బంది చొరవనురాష్ర్ట ప్రధాన కార్యదర్శి అభినందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియ చేసారు. వొచ్చే నెలలో మరింత నిబద్ధత కలిగి పెన్షన్ల పంపిణీ నిర్వహించాల్సి ఉందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News