Breaking News

ఉచిత ఇసుక విధానం అమలుకు చర్యలు .. జాయింట్ కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో గనులు, రవాణ, ఇరిగేషన్, ఏస్ఈబి, ఆర్డీవోలు, ఇతర అధికారులతో జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలకు తీసుకోవాల్సిన చర్యలపై ఆమె చర్చించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలన్నారు. గనులు, రవాణ, భూగర్భ జల, ఎన్ఫోర్స్మెంట్, సంబంధిత శాఖలు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అనధికార ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా అరికట్టేందుకు అవసరమైన చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఎస్ఈబి అధికారులకు సూచించారు. ఇసుక రీచ్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిన ప్రదేశాలను గుర్తించాలని, అక్రమ మైనింగ్ అరికట్టుటకు నిఘా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా, రెవెన్యూ డివిజన్ల స్థాయిల్లో కమాండింగ్ కంట్రోల్ రూమ్ లు, అదేవిధంగా సంబంధిత అధికారులతో కూడిన డివిజన్, మండల స్థాయి విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సమావేశంలో ఏఎస్పి జి.వెంకటేశ్వరరావు, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ల అధికారులు ఎం వాణి, పి పద్మావతి, డి రాజు, గనులశాఖ ఏడి ప్రతాపరెడ్డి, డిపిఓ ఎస్ వి నాగేశ్వర నాయక్, ఎస్ఈబి సూపర్నెంట్ జి గంగాధర్ రావు, భూగర్భ జల, రవాణ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *