Breaking News

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనదని, రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వైద్య చికిత్సలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వైద్యాధికారికి సూచించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఉంగుటూరు మండలంలోని పెద్దఔటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆరోగ్య కేంద్రంలోని మందులు, ఓపి రిజిస్టరు, ప్రయోగశాల పరిశీలించి కేంద్రంలో చేస్తున్న 63 రకాల పరీక్షలు, పాము కాటు, కుక్క కాటులకు అవసరమైన మందులు ఉన్నాయా లేదా వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షయ వ్యాధి కేసులు వివరాలు అడిగి వ్యాధిగ్రస్తులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సరిగా మందులు ఇస్తున్నారు లేదా తదితర వివరాలు అడిగి తెలుసుకొని సంతృప్తి చెందారు. అలాగే సురక్షిత ప్రసవ కేలండర్ ప్రకారం ప్రతి నెల గర్భిణీ స్త్రీలకు సరైన మందులు, సూచనలు ఇవ్వడం పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. హై రిస్క్ కేసులు, మలేరియా కేసుల వివరాలు, కుష్టు వ్యాధి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని అడగగా ఒకటి లేదా రెండు ప్రసవాలు జరుగుతున్నట్లు డాక్టర్ సుజిత కలెక్టర్కు వివరించారు. ఈ తనిఖీలో డాక్టర్ సుజిత, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *