Breaking News

బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వసతి గృహంలో విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా మెనూ ప్రకారం తప్పనిసరిగా భోజన సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వసతి గృహ సంక్షేమ అధికారిని ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ గన్నవరం మండలంలోని దేవాజి గూడెం లో ఉన్న వెనుకబడిన తరగతుల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహిస్తున్న పామోలిన్ నూనె, చిక్కి తదితర పలు రకాల రిజిస్టర్ లను, హాజరు పట్టిని కలెక్టర్ పరిశీలించారు. నిర్ణీత మెనూ ప్రకారం ఉదయం మధ్యాహ్నం రాత్రి వేళల్లో భోజనం సరిగా పెడుతున్నారా లేదా అని కలెక్టర్ విద్యార్థులను విచారించారు. అందుకు వారు సరిగా పెడుతున్నారని కలెక్టర్కు తెలిపారు. ఈ తనిఖీలో వసతి గృహ సంక్షేమ అధికారి జేవియన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *