మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కె.బి.ఆర్ గవర్నమెంట్ ఐ.టి.ఐ, గుడివాడ, కృష్ణ జిల్లా ఆవరణలో 08-07-2024 సోమవారము ఉదయం 9.00 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళ నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ ఎల్ గౌరిమణి తెలియచేసిన్నారు. ఈ ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళ కు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్ధులను అప్రెంటిస్ లో చేర్చుకోవడానికి ఇంటర్వ్యూ నిర్వహించారని తెలిపారు. మొత్తం 67 మంది హాజరు కాగా వారిలో 42 మంది అప్రెంటిస్ లుగా ఎంపిక చేసికున్నారు. ఈ కార్యక్రమము లో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఎల్ గౌరిమణి, జిల్లా ఇంటర్మీడియట్ వృతి విద్యా శాఖధికారి పీ. బి. సాల్మన్ రాజు, కంపెనీ H.R ప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News