Breaking News

గంజాయి అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటాం

-3వ డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మన రాష్ట్రాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్చిందని, జగన్ పాలనలో రాష్ట్రంలో శాంతి భధ్రతలు లేవని, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణలు గంజాయి సరఫరా నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారని త్వరలోనే గంజాయి అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని

శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ విజయలక్ష్మి కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించి రహదారులు, డ్రైనేజీను స్వయంగా పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి విజయనగర్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఈ కాలనీలో రహదారుల సమస్యతో పాటుగా తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందనే సమస్యను స్థానికులు తెలియజేశారన్నారు. దానితో పాటుగా నిత్యం అధిక సంఖ్యలో యువకులు గుంపులుగా చేరి గంజాయి సేవిస్తూ మహిళలను వేధించడంతో పాటుగా వివాదాలు సృష్టిస్తున్నారని స్థానికులు తమకు వివరించారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హాయంలో గంజాయి సరఫరా అనేది విచ్చలవిడిగా జరిగిందన్నారు. జగన్ పాలనలో పాఠశాల స్థాయిలో విద్యార్థి జేబులో కూడా గంజాయి ప్యాకెట్లు వచ్చాయన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గంజాయి అనే మాట రాష్ట్రంలో వినబడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. నారా చంద్రబాబు నాయుడు పాలనలో శాంతి భద్రతల విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదని చెప్పారు. గంజాయి సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖకు తెలియజేస్తానని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న బడ్డికొట్టు యజమానికి కూడా యువకులను కూర్చోకుండా చూడాల్సిందిగా చెప్పామన్నారు. డివిజన్లోని ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హామీ ఇచ్చారు. గంజాయి సరఫరాను అడ్డుకట్టే వేసేందుకు స్థానికంగా ఉంటున్న యువత కూడా దృష్టి పెట్టాలన్నారు. మూడో డివిజన్లోని ప్రతి సమస్యను పరిష్కారం అయ్యేలా చూస్తానని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉడా మాజీ ఛైర్మన్ తూమాటి ప్రేమనాథ్, కార్పోరేటర్ ముమ్మనేని ప్రసాద్, యలమంచిలి రాజేంద్రప్రసాద్, జయశంకర్, తుపంటి శ్రీనివాస్, కొర్రపాటి సురేంద్ర, చలసాని రమణ, కోడూరు ఆంజనేయ వాసు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *